Razakar : ఈ మూవీ చేసే వరకు వరకు నాకు ఈ విషయం తెలీదు – వేదిక

టాలీవుడ్ లో బాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. అయితే ఈ భామ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లయినా ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగలేదు. మంచి టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న వేదికకు ఇప్పటివరకూ సరైన బ్లాక్ బస్టర్ సినిమా పడలేదని చెప్పాలి. హిట్టు సినిమాలున్నా అందులో పెద్దగా పేరు తెచ్చిపెట్టిన పాత్రలు కూడా రాలేదు ఈ బ్యూటీకి. అయితే చాలా రోజుల తర్వాత రజాకార్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది వేదిక. మార్చి 15న ఈ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో రజాకార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరపడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి హాజరైన వేదిక సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణ చరిత్ర ఇంతుందని నాకు తెలీదు – వేదిక

రజాకార్ ఈవెంట్ కి హాజరైన వేదిక ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ రజాకార్ సినిమా స్టోరీ నాకు యాట సత్య గారు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమా ఒక రియల్ స్టోరీ అని అప్పుడు తెలీదు కూడా. నిజం చెప్పాలంటే తెలంగాణా కి అప్పట్లో స్వాతంత్య్రం ఇండియాతో పాటు కలిసి రాలేదని తెలియదు. ఆ తర్వాత సర్దార్ వాళ్ళ భాయ్ పటేల్ ఇండియన్ ఆర్మీ తో కలిసి హైదరాబాద్ కి స్వాతంత్య్రం తీసుకువచ్చారని తెలిసింది. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు హైదరాబాద్ గురించి, రజాకార్ హిస్టరీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఈ సందర్బంగా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గూడూరు నారాయణరెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి థ్యాంక్స్ తెలిపింది వేదిక.

- Advertisement -

శాంతవ్వ గా వేదిక..

ఇక అలాగే ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాలో తాను శాంతవ్వ అనే పాత్రలో నటించానని తెలంగాణ భైరాన్ పల్లికి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర అది అని ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటించానని తెలిపింది.

ఇక రజాకార్ సినిమాను సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించగా, యాట సత్యనారాయణ డైరెక్ట్ చేయడం జరిగింది. బాబీ సింహ ప్రధాన పాత్రలో, ప్రేమ, వేదిక, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేష్పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.  ఇక భీమ్స్ మ్యూజిక్ అందించిన రజాకార్ సినిమాలోని అన్ని పాటలు సుద్దాల అశోక్ తేజ రాయడం జరిగింది. నిజానికి మార్చి 1న రిలీజ్ కావాల్సిన రజాకార్ కొన్ని గ్రాఫిక్స్ వర్క్ కి సంబంధించిన సీన్ల ఎడిటింగ్ కి మేకర్స్ కి మరికొంత సమయం కావాల్సి వచ్చింది. అందుకే రెండు వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఇక ఫైనల్ గా మార్చి 15న సౌత్ భాషలన్నిటితో పాటు, హిందీలో కూడా తమ సినిమాని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు