Arijit Singh: మళ్లీ ఐదేళ్ల తర్వాత

బాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ విష్ణు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో లీడ్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చేసి తనకు తానుగా హీరోగా మెంటల్ మదిలో సినిమాతో కెరియర్ స్టార్ట్ చేశాడు శ్రీ విష్ణు.

ఆ తర్వాత శ్రీ విష్ణు కొన్ని అద్భుతమైన కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంది అని నిరూపించుకొని చాలామంది ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు. శ్రీ విష్ణు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఆడియన్స్ ని సాటిస్ఫై చేశాయి. అయితే ఒక ఫేజ్ లో శ్రీ విష్ణు సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడం మొదలయ్యాయి. శ్రీ విష్ణు వరుసగా ఫెయిల్యూర్సును చూసాడు.

ఇక రీసెంట్ గా సామజవరగమన అనే సినిమాతో అద్భుతమైన హిట్ సినిమాను అందుకున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చాడు శ్రీ విష్ణు అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురు కలిసి నటించిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ టీజర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ను పెంచింది. ఈ సినిమాపై ఒక క్యూరియాసిటీని కూడా కలిగించింది. అయితే ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు.

హిందీ సింగర్ అర్జిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను హిందీలో పాడాడు అర్జిత్ సింగ్. అయితే సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమైన స్వామి రారా సినిమాతో తెలుగులో కూడా పాటలను పాడాడు అర్జిత్ సింగ్. అర్జిత్ సింగ్ పాడిన పాటలు అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలానే కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన రౌడీ ఫెలో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. లిరిసిస్ట్ కెరియర్ ను మొదలు పెట్టిన కృష్ణ చైతన్య, ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. అయితే ఈ సినిమాలో కూడా అర్జిత్ సింగ్ మంచి పాటలను పాడాడు. ఇకపోతే మళ్లీ దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో అర్జిత్ సింగ్ తెలుగులో పాటలు పాడాడు. శ్రీ విష్ణు నటిస్తున్న ఓం భీమ్ బుష్ సినిమాలో అర్జిత్ సింగ్ మళ్లీ 5 ఏళ్ల తర్వాత పాటలు పాడినట్టు తెలుస్తుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు