Game changer : చరణ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అంటే అందులో గేమ్ ఛేంజర్, పుష్ప ది రూల్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెగా హీరోలైన చెర్రీ, బన్నీ ఇద్దరూ ఈ సినిమాలపై చాలా రోజులుగా దృష్టి పెట్టి వేరే సినిమాలు కూడా చేయకుండా ఈ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ రెండేళ్లుగా పుష్ప ది రూల్ కోసం కష్టపడుతుంటే, రామ్ చరణ్ అయితే గేమ్ ఛేంజర్ కోసం ఏకంగా నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు. అయితే ఈ సినిమాల షూటింగ్ మాత్రం ఇంకా ఫినిష్ కాలేదు. అందుకే రిలీజ్ డేట్లు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ అనూహ్యాంగా వైజాగ్ లో ఒకేసారి జరగనున్నాయని తెలిసిందే. ఇక పుష్ప కోసం అల్లు అర్జున్ ఇప్పటికే వైజాగ్ కూడా రావడం జరిగింది.

బన్నీ కోసం గ్రాండ్ వెల్ కమ్..

అయితే పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న నేపథ్యం లో ఎయిర్ పోర్ట్ లో బన్నీ కి గ్రాండ్ గా స్వాగతం పలికిన వైజాగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా షూటింగ్ లొకేషన్ వరకూ అల్లు అర్జున్ ని ర్యాలీ గా తీసుకెళ్లి ట్రిబ్యూట్ లా ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వైజాగ్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతకు మించి ట్రిబ్యూట్ ని గ్రాండ్ వెల్కమ్ ని చెర్రీ వచ్చే రోజున ఇవ్వబోతున్నారని సమాచారం.

- Advertisement -

గ్లోబల్ స్టార్ కు ఘన స్వాగతం..

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ నిమిత్తం తాజాగా వైజాగ్ రానున్నాడు. ఇప్పటికే వైజాగ్ లో షూటింగ్ మొదలవగా, సెట్స్ పైకి మాత్రం చెర్రీ ఇంకా రాలేదని సమాచారం. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఈ నెల 14న గేమ్ ఛేంజర్ సెట్స్ లో అడుగుపెట్టేందుకు వైజాగ్ వస్తున్నాడని సమాచారం. ఈ సందర్బంగా చరణ్ అభిమానులు 14వ తేదీన వైజాగ్‌కు వస్తున్న గ్లోబల్ స్టార్‌కి భారీ స్వాగతం పలకబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇంతకు ముందే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ వైజాగ్ లో జరగగా, అప్పుడు కూడా గ్రాండ్ వెల్ కం చెప్పారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మాత్రం బన్నీ ఫ్యాన్స్ పుష్ప రాజ్ కి గ్రాండ్ వెల్ కం చెప్పడం వల్ల, దాన్ని మించిన గ్రాండ్ వెల్ కం ట్రిబ్యూట్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా పుష్ప ది రూల్ ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతుంటే, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇంకా రిలీజ్ డేట్ కి కూడా నోచుకోలేదని చెప్పాలి. అయితే రామ్ చరణ్ బర్త్ డే అయిన మార్చి 27న రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు