Allu Arjun and Ram Charan : వైజాగ్ లో మెగా హీరోలు… ఇద్దరూ అక్కడేం చేస్తున్నారు ?

మెగా కాంపౌండ్ నుంచి పదుల సంఖ్యలో హీరోలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ వాళ్లలో చిరంజీవి వారసత్వాన్ని నిలబెడుతుంది మాత్రం రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మాత్రమే. వీరిద్దరూ పాన్ ఇండియా రేంజ్ లో ఎదుగుతూ మెగా ఫ్లాగ్ ను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేస్తున్నారు. అయితే స్టార్ హీరోలైన వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్లకు ఉన్న షెడ్యూల్ ప్రకారం కలవడం కాస్త కష్టమే. కానీ తాజాగా ఇద్దరు స్టార్స్ వైజాగ్ లో, అది కూడా త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో సందడి చేస్తారు అన్న వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ వీరిద్దరికీ అక్కడ ఏం పని? అనే వివరాల్లోకి వెళ్తే…

వైజాగ్ లో పుష్ప రాజ్ కు ఘన స్వాగతం…
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప : ది రూల్” మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2021లో రిలీజై సంచలనం సృష్టించిన “పుష్ప” మూవీకి సీక్వెల్ గా “పుష్ప-2” రాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మార్చ్ 10న విశాఖపట్నంలో అడుగు పెట్టారు. “పుష్ప-2” షూటింగ్ కోసం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర బృందం అంతా వైజాగ్ కు చేరుకున్నారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అభిమానులు వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ హీరోకు పరిసరాలు దద్దరిల్లిపోయే రేంజ్ లో ఘన స్వాగతం పలికారు. కాగా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ పోర్టులో చిత్రీకరణ జరుగుతుండగా, వారం రోజులపాటు వైజాగ్ లో “పుష్ప-2” మూవీ షూటింగ్ జరగనుంది. ఇక ఈ మూవీని ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు “పుష్ప” మూవీకి మూడవ సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఎదగడానికి ట్రై చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రదర్శితం కాగా, ఫెస్టివల్ సందర్భంగా బెర్లిన్ వెళ్లిన బన్నీ గ్లోబల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “పుష్ప 3” కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వైజాగ్ కే…
కథ ఇప్పటికే అల్లు అర్జున్ వైజాగ్ చేరుకొని షూటింగ్ లో పాల్గొంటుండగా, త్వరలోనే రామ్ చరణ్ కూడా తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళబోతున్నట్టు సమాచారం. మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న తన కొత్త మూవీ “గేమ్ చేంజర్” షూటింగ్ కొత్త షెడ్యూల్ ను అక్కడే ప్లాన్ చేశారు. ఈ నెలాఖరు వరకు వైజాగ్ లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా త్వరలోనే వైజాగ్ వెళ్ళనున్నారు. కాగా మే నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. “గేమ్ చేంజర్” మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. దీంతో చెర్రీ అభిమానులు ఈ మూవీ అప్డేట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి “జరగండి” అనే సాంగ్ రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు