Jaathi Rathnalu : ముగ్గురు కుర్రాళ్ళు మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించారు

అనుదీప్ కె.వి, పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ సినిమా తర్వాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన రెండవ సినిమా జాతి రత్నాలు తెరకెక్కించాడు. జాతి రత్నాలు సినిమా క్రియేట్ చేసిన సంచలనం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మామూలు కథతో ప్రేక్షకులందరినీ థియేటర్లో కూర్చొని పెట్టి కడుపుబ్బ నవ్వించాడు అనుదీప్.

అయితే అనుదీప్ మిస్డ్ కాల్ అని ఒక షార్ట్ ఫిలిం చేశాడు. అయితే ఆ షార్ట్ ఫిలిం చూడటానికి క్లారిటీగా కూడా ఉండదు. కానీ ఆ షార్ట్ ఫిలిం లో డైలాగ్స్ మాత్రం స్పష్టంగా వినిపిస్తాయి. ఈ షార్ట్ ఫిలిం చూసిన నాగ్ అశ్విన్ అనుదీప్ కి మెసేజ్ చేశాడు. అయితే అప్పటికే అనుదీప్ పిట్టగోడ సినిమా చేయడం.ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ మళ్లీ అవకాశం ఇచ్చి కలుస్తాడు అని అనుదీప్ ఊహించలేదు. అయితే మొత్తానికి నాగ్ అశ్విన్ నుంచి అనుదీప్ కి కాల్ వచ్చింది. అయితే అనుదీప్ వెళ్లి నాగ్ అశ్విన్ కలిసాడు.

నాగ్ అశ్విన్ మనిద్దరం సినిమా చేద్దామని మాట్లాడుతుంటే అనుదీప్ మాత్రం పిట్టగోడ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. అయితే అన్ని మర్చిపోయిన నాగ్ అశ్విన్ నేను ఇంకో సినిమా గురించి మాట్లాడుతుంటే నువ్వు పిట్టగోడ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ, అనుదీప్ ను క్వశ్చన్ చేశాడు.

- Advertisement -

చాలాసేపు డిస్కషన్ తర్వాత వీరిద్దరూ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుదీప్ కూడా తన స్ట్రెంత్ తో కామెడీ కథని తయారు చేశాడు. ఒక ముగ్గురు ఇన్నోసెంట్ పీపుల్ ఊరు నుంచి సిటీ కొచ్చి వాళ్ళు చేయని ఒక క్రైమ్ లో ఇరుక్కుపోతే ఎలా తప్పించుకున్నారు అనే పాయింట్ ను తీసుకొని అద్భుతమైన కామెడీ జనరేట్ అయ్యేటట్టు రాసుకున్నాడు అనుదీప్. అయితే సినిమా అంటే ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉండాలి. కథ ఉండాలి. ఫ్రేమ్స్ అని కాకుండా ఒక మంచి కథను చెప్పే విధానం తెలియాలి. ఆడియన్స్ కి ఒక రిలీఫ్ ఇవ్వాలి. అని బలంగా నమ్మి అనుదీప్ ఆ కథను తెరకెక్కించాడు.

అయితే ఆ సినిమా తర్వాత ఒక సంచలనాన్ని సృష్టించింది అని చెప్పొచ్చు. ఆ సినిమా పూర్తయిన తర్వాత కూడా దాదాపుగా ఒక సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండా ఉంచారు. ఎట్టకేలకు ఓటీటీలో మంచి డీల్స్ వచ్చినా కూడా ఈ సినిమా థియేటర్లోనే పర్ఫెక్ట్ గా ఉంటుందని నమ్మి, దాన్ని థియేటర్లో రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఆ సినిమా స్ట్రెంత్ ఏంటో ప్రూవ్ చేసుకొని అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

అయితే ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్ అయిపోయాడు అనుదీప్. ఆ తర్వాత అనుదీప్ చేసిన ప్రిన్స్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇక ప్రస్తుతం అనుదీప్ రవితేజతో సినిమాను చేయనున్నాడు. అయితే నేటికీ జాతి రత్నాలు సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు