Premalu : డబ్బింగ్ సినిమా వీకెండ్ రచ్చ.. తెలుగు సినిమాలకు ధీటుగా..!

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా ఒకటి. ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ముందు నుండి అంచనాలు ఉన్నాయి. సరిగ్గా నెల క్రితమే మలయాళం లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఈ చిన్న సినిమా తాజాగా తెలుగులో మహా శివరాత్రి కానుకగా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో మలయాళం నుండి డబ్ అయ్యి రిలీజ్ అయిన ప్రేమలు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, ఉన్న లిమిటెడ్ రిలీజ్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది.

చిన్న సినిమా వీకెండ్ రచ్చ..

మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా తెలుగులో గామి, భీమా సినిమాలకు పోటీగా ఇవ్వడం విశేషం. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రోజు రోజుకి తెలుగులో మంచి గ్రోత్ చూపించి మంచి కలెక్షన్లను వసూలు చెసింది. తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజున ఈ సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ రేంజ్ 2.55 కోట్ల వరకు సొంతం గ్రాస్ ను సొంతం చేసుకుంది. అయితే తెలుగు లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 కోట్ల దాకా ఉండగా, వర్కింగ్ డేస్ లో ఈజీ గా బ్రేక్ ఈవెన్ అయ్యి తెలుగులో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి.

- Advertisement -

100 కోట్ల ప్రేమలు..

ఇక ప్రేమలు ఒరిజినల్ రిలీజ్ అయ్యి ఇప్పటికే నెల పూర్తయిపోగా, తాజాగా ఇప్పటివరకూ అంటే 31 రోజులు పూర్తి చేసుకోగా, టోటల్ గా సాధించిన మలయాళం కలెక్షన్స్ తో పాటూ, తెలుగు వెర్షన్ కలెక్షన్లు కలిపి ఏకంగా 100 కోట్ల గ్రాస్ దాటేయడం విశేషం. కేరళ 52.80CR, తెలుగు రాష్ట్రాల్లో 1.85Cr, రెస్ట్ అఫ్ ఇండియా 8.05 కోట్లు, ఓవర్సీస్ 37 కోట్ల తో కలిపి వరల్డ్ వైడ్ గా ప్రేమలు 99.70 కోట్లు వసూళ్లు దాటేసింది. ఇక రేపటికల్లా దాదాపు 102 నుండి 103 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. కాగా షేర్ వాల్యూ 44 కోట్ల వరకు ఉంటుంది. ఓవరాల్ గా ప్రేమలు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ 100 కోట్ల మార్క్ ని అందుకుందని చెప్పొచ్చు…. తెలుగు లో మరీ ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో సాలిడ్ రన్ నే ఈ సినిమా సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పోచ్చు. మరి తెలుగులో కూడా లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు