Bhimaa : వారాంతం ఎంతోచ్చినా.. అసలు లెక్క అంతుంది మరి?

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా మహాశివరాత్రి సందర్బంగా థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత గోపీచంద్ ఒక పక్కా ఆక్షన్ బ్యాక్ డ్రాప్ లో బజ్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకుల నుండి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే గోపీచంద్ గత సినిమాలను బట్టి ఈ సినిమా కాస్త బెటర్ గా ఉండడంతో వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకుంది. అయితే దీనికి పోటీగా గామి, ఇంకా ప్రేమలు రిలీజ్ కావడంతో ఈ సినిమాకి చాలా దెబ్బ పడిందని చెప్పొచ్చు. పైగా ఈ సినిమా ఆక్షన్ సినిమా కావడం వల్ల రొటీన్ గా ఉండడం వల్ల ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవలేదు. అయితే సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా పండగ అడ్వాంటేజ్ వల్ల ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

టార్గెట్ కు చాలా దూరంలో..

అయితే భీమా సినిమా వీకెండ్ లో బెటర్ వసూళ్లు అందుకున్నా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా దూరం కలెక్షన్ల పరుగును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మొత్తం మీద 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమా పెద్దగా గ్రోత్ ని చూపించలేక పోయింది. ఓవరాల్ గా భీమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇక భీమా మూడు రోజుల వీకెండ్ కలెక్షన్లను ఒక్కసారి ఏరియా వారీగా గమనిస్తే.. నైజాం లో 1.60 కోట్లు, సీడెడ్ లో 0.76 కోట్లు, ఆంధ్ర 1.80 కోట్లు, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా ఇంకా ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి మరో 45 లక్షలు రాబట్టింది. మొత్తంగా భీమా వరల్డ్ వైడ్ గా 4.61 కోట్ల షేర్ 8.35కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. అయితే భీమా ఓవరాల్ గా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 7.39 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది.

పోటీలో కష్టమే..

అయితే భీమా సినిమాకు సోలో రిలీజ్ దక్కి ఉంటే ఈ టార్గెట్ కి బ్రేక్ ఈవెన్ దాదాపుగా అయ్యేదని భావించవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన టాక్ కి ఆ వసూళ్ళని బట్టి, ఇంకా పోటీ బట్టి బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే అనిపిస్తుంది. మరి ఇక వర్కింగ్ డేస్ లో భీమా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు