Aa okkati Adakku Teaser talk : అల్లరోడి పెళ్లి ముచ్చటే.. కానీ పాత ముచ్చటేనా?

టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ ఈ సంవత్సరం జోరు మీదున్నాడు. లాస్ట్ ఇయర్ ఉగ్రం తో ప్లాప్ అందుకున్నా, ఈ ఇయర్ నాగార్జున తో నా సామిరంగ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో నాగార్జున కంటే ఎక్కువగా అల్లరి నరేష్ కే పేరు రావడంతో నరేష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టీజర్ రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు “ఆ ఒక్కటి అడక్కు”. ఈ పేరు వినగానే ముప్పై ఏళ్ళ కింద వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు” గుర్తొస్తుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను నరేష్ తండ్రి ఇవివియే దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్ తో నరేష్ వస్తున్నాడు. ఇంతకు ముందు రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవగా, ఇక ఈ సినిమా టీజర్ లో హీరోని పెళ్లి కానీ యువకుడిగా చూపిస్తూ, మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయింది.

టీజర్ టాక్..

తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా టీజర్ రిలీజ్ కాగా.. టీజర్ లో 25 రోజుల్లో పెళ్లి జరగకపోతే అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుందని పంతులుగా రఘు బాబు డైలాగ్ తో అసలు కథ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ టైప్ అఫ్ ఇంట్రోలు చాలా సినిమాలకు ఉంటాయి. ఇక అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉండడం, మరొకవైపు చుట్టుపక్కల వారు కూడా అల్లరి నరేష్ పెళ్లి ఎప్పుడు అని విసిగిస్తూ ఉండడంతో అతను కోపంతో కొట్టడం వంటి సీన్స్ టీజర్ లో చూపించారు. ఇక ఈ సినిమాలో అతనికి జోడిగా ఫారియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టీజర్ లో నరేష్ తో ఫరియా బంధం ప్రేమగా మారినప్పటికీ ఆమె మాత్రం పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటాను అనే మాట చెప్పగానే ఆ ఒక్కటి అడక్కు అంటూ అల్లరి నరేష్ కు ట్విస్ట్ ఇస్తుంది. ఇక్కడితో టీజర్ ఎండ్ అవుతుంది.

- Advertisement -

మరి హీరోయిన్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అన్న పాయింట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. టీజర్ చూస్తుంటే రెగ్యులర్ కామెడీ యాంగిల్ లోనే ఈ సినిమా ఉన్నట్లు అనిపిస్తుంది. టైటిల్ తగ్గట్టుగా సినిమాలో ఏదైనా కొత్త పాయింట్ ఉంటే జనాలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ నరేష్ కి హిట్టు కోసం తిప్పలు తప్పవు. ఇక మల్లి అంకం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.

హిట్ ట్రాక్ ఎక్కుతాడా?
టాలీవుడ్ లో కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లరి నరేష్ వరుసగా ఫ్లాప్స్ రావడంతో మళ్లీ కొత్త తరహా దారిలోకి వెళ్లి సక్సెస్ అందుకున్నాడు. నాందీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి లాభాలను అందించింది.అయితే ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు అనుకునే లోపు మళ్ళీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో కాస్త కొత్తగా ట్రై చేసినప్పటికీ ప్లాప్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తనకు ఒకప్పుడు అచ్చిచ్చిన కామెడీ జోనరే అయినా రొటీన్ కామెడీ డ్రామా అయితే మాత్రం జనాలు మొహమాటం లేకుండా తిరస్కరిస్తారు. మరి ఆ ఒక్కటి అడక్కు సినిమా ఆ రోజుల్లో సినిమాలా మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు