RC16 : చరణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ న్యూస్.. ముహూర్తం ఫిక్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఫిక్స్ అయిన ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావడానికి ఏడాదికి పైగా టైం తీసుకున్నారు. దాదాపు సరిగ్గా ఏడాది కిందటే రామ్ చరణ్ బర్త్ డే రోజు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ మొదలుకాలేదు. గేమ్ ఛేంజర్ పూర్తయ్యాక మొదలుపెడదామని అనుకునేసరికి అది కాస్తా మరింత సమయం పడుతుంది. అందుకే ఆ సినిమా షూటింగ్ చేస్తూనే రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా మొదలెడదామని ఫిక్స్ అయ్యాడు. ఇక RC16 సినిమాకి సంబంధించి తాజాగా మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్ వచ్చేసింది.

RC16 ముహూర్తం ఫిక్స్..

చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RC16 సినిమా ఓపెనింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 20న రామ్ చరణ్ బుచ్చిబాబు సాన సినిమా ప్రారంభం కానుందని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. రామ్ చరణ్ సహా చిత్ర యూనిట్ సమక్షంలో ప్రారంభం జరిపి, ఏప్రిల్ మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయొచ్చని సమాచారం. ఇక బుచ్చిబాబు దాదాపు నాలుగు నెలలుగా ఈ సినిమాలో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అక్కడి ప్రాంత వాసులనే ఎక్కువగా నటీనటుల్ని తీసుకుంటున్నాడు. ఇక చరణ్ తో చేయబోయే సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కలియుగ భీముడు కుస్తీ వీరుడు అయిన కోడి రామమూర్తి బయోపిక్ గా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం చరణ్ బుచ్చిబాబు సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఓపెనింగ్ డే రోజు క్లారిటీ వస్తుంది.

- Advertisement -

మైత్రి నిర్మాణం లో భారీ తారాగణం..

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా లో భారీ తారాగణం నటించనున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయింది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అలాగే పలువురు పాన్ ఇండియా స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా, ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన మ్యూజిక్ సిట్టింగ్ వేయడం విశేషం. RC16 కథలోని పొటెన్షియల్ ని కనిపెట్టి దానికి తగ్గట్టు రెహమాన్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని సమాచారం. ఈ సినిమా థీమ్ మ్యూజిక్, బీజీఎమ్, ఓవరాల్ సౌండ్ డిజైన్ పై ఇప్పటినుండే వర్క్ చేస్తున్నారట. ఇక రామ్ చరణ్ బర్త్ డే (మార్చి27) రోజున ఒక క్రేజీ ఫస్ట్ లుక్ తో సినిమాపై హై ఇంపాక్ట్ కలిగేలా రెడీ చేస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా కోసం మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే ఓపెనింగ్ డే వరకు వెయిట్ చేయాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు