Arundhati nair: రూ.లక్షలు పెట్టినా లాభం లేదు.. చావు బతుకుల మధ్య హీరోయిన్..!

Arundhati Nair.. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.. గత నెల మార్చి 14వ తేదీన ఒక ఇంటర్వ్యూకి హాజరైన అరుంధతి నాయర్ తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో.. ఒక కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.. ప్రస్తుతం అరుంధతి నాయర్ ఆరోగ్యం విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. ప్రాణం నిలబెట్టుకోవడానికి పరితపిస్తోంది.. ఎవరైనా సహాయం చేస్తే తప్ప నిలబడని ప్రాణం.. ఈ ప్రాణం కోసం ఇంస్టాగ్రామ్ ద్వారా తన సోదరీ ఇప్పటికే పలుమార్లు సహాయం చేసే దాతల కోసం వేడుకుంటున్నారు.. అందుకోసం బ్యాంకు వివరాలను కూడా ఇంస్టాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది..

ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చు..
త్రివేండ్రంలోని అనంతపురి ఆసుపత్రిలో అరుంధతి నాయర్ కు చికిత్స జరుగుతోందని ఆమె సోదరీ ఆర్తి తెలిపింది.. ఇప్పుడు వెంటిలేటర్ సహాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిసింది.. వైద్యం కోసం ప్రతి రోజు రూ .2లక్షల ఖర్చు అవుతుందని.. ఇప్పటికే అరుంధతి నాయర్ కోసం తాము రూ.40 లక్షలు ఆసుపత్రి బిల్లు చెల్లించామని కూడా ఆర్తి చెబుతోంది.. ఇక అరుంధతి తలకు , వెన్నెముకకు తీవ్రంగా గాయాలు కావడం వల్లే మెదడులో రక్తం గడ్డ కట్టిందట. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ఇటీవల పూర్తయినట్లు అరుంధతి నాయర్ చెల్లెలు ఆర్తి చెప్పుకొచ్చింది.. ఇక ఇప్పుడు కదల లేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది..

అయినా ప్రాణం నిలుస్తుందా..
చికిత్స పొందుతూ ఇన్ని రోజులైనాప్పటికీ ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని అడిగితే.. క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు.. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకల చికిత్స చేయవలసింది..కాబట్టి మీకు తోచినంత సహాయం మాకు చేయండి అంటూ ఆర్తీ కోరుతోంది. రూ.లక్షలు పెట్టినా లాభం లేకుండా పోతుంది అంటూ కన్నీరు మున్నీరు అవుతోంది. ఇప్పటికే పలువురు మలయాళ నటీమనులు కూడా ఆమెకు సహాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు..

- Advertisement -

అరుంధతి నాయర్ సినిమాలు..
అరుంధతి నాయర్ సినిమాల విషయానికి వస్తే.. తమిళ చిత్రమైన పొంగి ఎజు మనోహర అనే సినిమా ద్వారా అరుంధతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన సైతాన్ సినిమాలో కూడా ఈమె నటించారు. అయితే ఇదే సినిమాని తెలుగులో భేతాళుడు పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిపోయారు. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఈరోజు ఇలా తన ప్రాణాల కోసం మృత్యుతో యుద్ధం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆమెకు సహాయం చేసి ఆమెను మళ్లీ బ్రతికించాలని ఆకాంక్షిస్తున్నారు.. చూద్దాం మరి ఎవరు అరుంధతి నాయర్ కి సహాయాన్ని అందిస్తారో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు