Family Star First Review : “ఫ్యామిలీ స్టార్” ఫస్ట్ రివ్యూ

Family Star First Review : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను పెంచింది. మరికొన్ని గంటలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ స్పెషల్ షోలను సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల కోసం వేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందన్న టాక్ బయటకు వచ్చింది. మరి ఇంతకీ ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది? అనే విషయంలోకి వెళ్తే…

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ రివ్యూ…

విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ ఫ్యామిలీ స్టార్ మూవీని నిర్మించారు. అమెరికాలో ఈరోజు ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ షోలు పడుతుండగా, మరోవైపు హైదరాబాదులోని మీడియా కుటుంబాల కోసం ప్రత్యేకంగా స్పెషల్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందే ఒక షోను విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీతో పాటు కొంతమంది ప్రముఖులు చూసారు. ఇక సినిమా ఫస్ట్ రివ్యూ ( Family Star First Review ) విషయంలోకి వెళ్తే… ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగుందని టాక్ నడుస్తోంది. స్టోరీలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ ఛాయలు ఉంటాయని సమాచారం. అలాగే హీరోయిన్ విషయంలో ఉండే ట్విస్ట్ ఆకట్టుకుంటుందని, సెకండ్ హాఫ్ హాయ్ నాన్న స్టైల్ లో స్లోగా ఉంటుందని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీకి కనెక్ట్ అవుతారని సమాచారం. మరి ఈ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్న ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? అంటే ఏప్రిల్ 5న ప్రేక్షకులు ఇచ్చే తీర్పుతో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ఫ్యామిలీ స్టార్ పై దిల్ రాజు భార్య రివ్యూ…

విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పాటు దిల్ రాజు ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ స్పెషల్ షోను వీక్షించారు. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని ఈ సినిమాకు రివ్యూ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. తేజస్విని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని, ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని, క్రెడిబుల్ రివ్యూ ఇస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. తేజస్విని ఈ మూవీతో కొట్టేసారండి అని కాంప్లిమెంట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ఆయన కూతురు హర్షిత రెడ్డి విజయ్ దేవరకొండ కుమ్మేసాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించిందట. మరోవైపు విజయ్ దేవరకొండ తండ్రి ఈ సినిమాను చూసి దిల్ రాజు బయోపిక్ లా ఉందని అన్నారట. మొత్తానికి హీరో, నిర్మాతల కుటుంబాల రివ్యూతో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. మరి ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ అండ్ సి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు