Kalyan Ram: కళ్యాణ్ రామ్ ” NKR -21″ షూటింగ్స్ పార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం..!

Kalyan Ram: ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్స్ లో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ దేవరా సినిమా షూట్లో అగ్ని ప్రమాదం జరిగింది. కాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్న సరికొత్త సినిమా NKR-21 సెట్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

పది రోజుల పాటు జరిగే షూటింగ్ కోసం వేసిన సెట్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. 9 రోజుల షూట్ పూర్తి అయిన తరువాత రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం కారణంగా నిర్మాతలకు ఏకంగా రూ. నాలుగు కోట్లు నష్టం అయినట్లు తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

A huge fire accident in the shooting part of Kalyan Ram "NKR-21"
A huge fire accident in the shooting part of Kalyan Ram “NKR-21”

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి వెంకయ్య చౌదరి, అశోక్, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు