Suriya’s Next: అదిరిపోయే బ్యాక్డ్రాప్ లో సూర్య – చందు మొండేటి మూవీ..!

Suriya’s Next

కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి, కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సూర్యతో చేయబోయే సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నాగచైతన్యతో మరో సినిమా లైన్లో పెట్టిన చందు, ఈ రెండు సినిమాలకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగచైతన్య సినిమా కోసం జాలర్ల లైఫ్ స్టైల్ మీద రీసర్చ్ చేస్తున్న చందు సూర్యతో చేయబోయే సినిమా కోసం ఇంట్రస్టింగ్ బ్యాక్డ్రాప్ లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. వేదాల బ్యాక్డ్రాప్ లో ఒక లైన్ ని ఇప్పటికే సూర్యకి వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ స్క్రిప్ట్ గురించి అడిగి తెలుసుకుంటున్నాడట.
ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్న సూర్య తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్లో ఒక సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టాడు సూర్య. కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక చందు మొండేటి సినిమా స్టార్ట్ అవ్వటానికి మినిమమ్ రెండేళ్లు పట్టే అవకాశం ఉంది గనక ఈ గ్యాప్ లో నాగచైతన్య సినిమా కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు చందు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తన సత్తా చాటాలని భావిస్తున్నాడట చందు మొండేటి. ప్రస్తుతం కంగువా లాంటి పీరియాడిక్ సినిమా చేస్తున్న సూర్య, వేదాల బ్యాక్డ్రాప్ లో మరో డిఫరెంట్ స్టోరీని లైన్లో పెట్టిన క్రమంలో ఈ సినిమాలతో సూర్య పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందటం ఖాయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు