Chandu: స్టార్ హీరోతో చందు మొండేటి..!

కార్తికేయ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి. ఈ యంగ్ డైరెక్టర్ ఇటీవల కార్తికేయ 2ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా రిలీజ్ దాదాపు ఏడాది కావస్తున్నా చందు తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తన నెక్స్ట్ సినిమా ఉండబోతోంది అంటూ వార్తలొస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితం అవనున్న ఈ సినిమా 3భాషల్లో రూపొందబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఇంతకాలం ఏ ప్రాజెక్ట్ కమిట్ కాకపోవటం చందు చేసిన మంచి పనే అవుతుంది.

మన పురాణాలు, సైన్స్ వంటి అంశాల పట్ల మంచి పట్టున్న డైరెక్టర్ చందు మొండేటి సూర్య లాంటి వర్సటైల్ హీరో దొరికితే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. తమిళనాట కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సూర్య ఇప్పటివరకు స్ట్రైట్ తెలుగు సినిమా తీయలేదు. ఇదే విషయంపపై మీడియా కూడా పలుసార్లు ప్రశ్నించగా, మంచి కథ కోసం ఎదురు చూస్తున్న అంటూ సమాధానం ఇచ్చాడు.

మొత్తానికి సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చందు డైరెక్షన్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం కార్తికేయ3 కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్న చందు, ఆ సినిమా కంటే ముందే సూర్య సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సైమల్టేనియస్ రూపొందించనున్నారట. మరి, ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి నేపథ్యం ఉన్న కథతో సినిమా రానుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు