Virupaksha: తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తెలుగులో రోజురోజుకి తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. భీమ్లా నాయక్ చిత్రంలో రానా వైఫ్ పాత్రతో పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో యువతను తన వైపు తిప్పుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇటీవలే “సార్” చిత్రంతో మరో ఘన విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమా తమిళ్, తెలుగులో రెండిట్లోనూ సక్సెస్ అయింది.

ఇక సంయుక్త  తాజాగా నటించిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఏలూరులో జరిగింది. ఈ ఈవెంట్ కి విరూపాక్ష చిత్ర యూనిట్ తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం సంయుక్త. అయితే అది తన గ్లామర్ వల్ల కాదు, తన చక్కటి తెలుగు మాటలతో అందర్నీ ఆశ్యర్యపోయేలా చేసింది.

విరూపాక్ష ఈవెంట్ లో సంయుక్త పూర్తిగా తెలుగులో మాట్లాడింది. ముందుగా అందరికి హాయ్ చెప్తూ తన పై చూపించే ప్రేమకి అభిమానులకి కృతజ్ఞతలు చెప్పింది. అంతే కాదు ఈ ఈవెంట్ కి ఫ్యామిలీతో వచ్చిన పబ్లిక్ కి ధన్యవాదాలు చెప్పింది. ఇక ఈ ఈవెంట్ లో సంయుక్త.. భీమ్లా నాయక్ పేరు చెప్పగానే ఏరియా మొత్తం ఈలలతో,కేకలతో హోరెత్తింది. ఈ క్రేజ్ ఏంటో తనకి తెలుసు అని, కళ్యాణ్ కి తాను కూడా పెద్ద ఫ్యాన్  అని, ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలని చెప్పింది. ఇక డైరెక్టర్ కార్తీక్ దండు గురించి మాట్లాడుతూ ఈ మూవీ లోని ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది. తనలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని బాగా వాడుకుంది కార్తీక్ మాత్రమే అని చెప్తూ, ఇక ఈ మూవీ ని చూసి కార్తీక్ దండు వాళ్ల అమ్మ చాలా సంతోషిస్తారని చెప్పింది. ఇక సుకుమార్ గురించి చెప్తూ “యువర్ క్రియేటెడ్ సెన్సేషన్ ఇన్ ఎంటైర్ ఇండస్ట్రీ.. ఇక తగ్గేదేలే” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక ఈ సినిమా లో నటించిన నటీనటులందరికి థ్యాంక్స్ చెప్తూ స్పీచ్ ముగించింది. ఏదీ ఏమైనా బాలీవుడ్ నుంచి ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్లకు, చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నా తెలుగు మాట్లాడని హీరోయిన్లకు సంయుక్త ఒక రకంగా గట్టి కౌంటర్ వేసిందని చెప్పాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు