Kavya Kalyanram: ఆ హీరో నన్ను ఎత్తుకుని ఆడించేవారు

కావ్య కళ్యాణ్‌రామ్.. ఈ పేరు చెప్తే ఎవరూ పెద్దగా గుర్తు పట్టక పోవచ్చు. కానీ బలగం హీరోయిన్ అంటే అప్పుడే, ఆ హీరోయినా, పొట్టిగా, బొద్దుగా చాలా చలాకీ గా ఉంటుంది అంటారు. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఒక్క సారిగా ఫేమస్ అయింది కావ్య కళ్యాణ్ రామ్. అయితే ఈ యువ నటి అంతకు ముందే మసూద సినిమాలో నటించినా  పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, బలగం చిత్రంతో హీరోయిన్ గా పొట్టి పిల్లగా యావత్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. బలగం బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కావ్య ప్రస్తుతం శ్రీ సింహా హీరోగా వస్తున్న ఉస్తాద్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే కావ్య కళ్యాణ్ రామ్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే. స్నేహమంటే ఇదేరా మూవీతో మొదలెట్టి, ఠాగూర్, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్ర బోస్, గంగోత్రి, బాలు లాంటి సినిమాల్లో బాలనటి గా కనువిందు చేసింది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అప్పటి హీరోలతో కలిసి నటించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. కావ్య మాట్లాడుతూ “అప్పటి లెజెండరీ స్టార్స్ అందరి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు” అని చెప్పింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అయిన ఠాగూర్ లో పిల్లి కళ్ళ పాప గా క్యూట్ గా నటించింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ “చిరంజీవి నన్ను సొంత కూతురిలా చూసుకునేవారు. నన్ను ఆయన తన భుజాలపై ఎత్తుకుని ఆడించే వారు అంది. రీసెంట్ గా బలగం సక్సెస్ లో భాగంగా చిరంజీవిని మీట్ అయ్యామని, అక్కడ ఆయన తొందరగా గుర్తు పట్టలేదు అని, తర్వాత నేను ఠాగూర్ మూవీ అనగానే పిల్లి కాళ్ళ పాప నువ్వా అని అన్నారు. ఒకప్పుడు తన సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోయిన్ అయ్యిందంటే అస్సలు గుర్తుపట్టలేకపోయానని, వీళ్ళు హీరోయిన్ అయ్యారంటే మేము ముసలోళ్లం అయ్యామన్న ఫీలింగ్ కలుగుతోందని చిరంజీవి అన్నారు” అని కావ్య కళ్యాణ్ రామ్ చెప్పింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు