Supriya: పవన్ మూవీ సెట్స్ నుంచి పారిపోయాను..

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఈ సినిమా వచ్చి దాదాపు 25 ఏళ్ళు అయింది. పవన్ కళ్యాణ్ , సుప్రియ జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా రిలీజ్ తరువాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాతో బిజీ అయ్యాడు. కానీ హీరోయిన్ సుప్రియ మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి, ఆ తరువాత తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది.

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తరువాత సుప్రియ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం రాకపోవడంతో తాను యాక్టింగ్ ని వదిలేసి ప్రొడక్షన్ వైపు వెళ్ళింది. హీరోయిన్ గా సక్సెస్ కాలేని సుప్రియ ప్రొడ్యూసర్ గా మాత్రం సక్సెస్ అయింది. ఇప్పటి వరకు తాను ప్రొడ్యూస్ చేసిన దాదాపు సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. కథల విషయం లో జాగర్తగా వ్యవహరిస్తుండటం, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించటంతో సుప్రియకి ప్రొడ్యూసర్ గా మంచి పేరు వచ్చింది.

అయితే సోనీ లైవ్ ఓటిటి ప్లాట్ఫామ్ లో వస్తోన్న నిజం విత్ స్మిత షో లో ఆమె రీసెంట్ గా పాల్గొన్నారు. “పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో డెబ్యూ హీరోయిన్ గా లాంచ్ అయ్యారని పవన్ తో పని చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ?”  అని స్మిత అడిగిన ప్రశ్నకి సుప్రియ సమాధానం చెప్తూ మొదట్లో “నాకు యాక్టింగ్ సరిగా వచ్చేది కాదు. ఒకటి రెండు సార్లు సెట్ లో నుంచి పారిపోయాను కూడా. అప్పుడే పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి ధైర్యం చెప్పి నువ్వు ఇలా పారిపోవద్దు. ఎలాగైనా సినిమా ఫినిష్ చేయాలి అని నాకు చాలా సపోర్ట్ చేసారు” అని సుప్రియ చెప్పుకొచ్చారు.

- Advertisement -

అయితే సుప్రియ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ గూఢచారి సినిమాలో ఒక కీ రోల్ లో ఆమె నటించింది. సినిమా సూపర్ హిట్ అవడం తో తాను మళ్ళీ యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం ఆమె గూఢచారి-2 లో నటిస్తుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు