Tollywood: ఇద్దరూ వస్తున్నారు – ఈసారైనా కొడతారా..?

అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ, ఆశించిన హిట్ ఇప్పటికీ అందుకోలేకపోయారు. నాగచైతన్య కెరీర్లో ‘ఏం మాయ చేసావే, ‘మజిలీ’ వంటి మంచి సినిమాలు ఉన్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. అఖిల్ హీరోగా ఇప్పటికి నాలుగు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయాయి. సినిమాల్లోకి ఎంటరై సంవత్సరాలు గడుస్తున్నా అన్నదమ్ములిద్దరూ టైర్ 2 హీరోలుగానే మిగిలిపోయారు. అయితే ప్రస్తుతం ఒకరి తర్వాత ఒకరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుండగా, వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ అవుతుంది. ఈ డేట్స్ వెనక ముందు తెలుగులో పెద్ద సినిమాలు లేకపోవటం ఈ వారసులిద్దరికీ అడ్వాంటేజ్ అవుతుంది. ఏప్రిల్ 21న సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ రిలీజ్ ఉన్నప్పటికీ వారం గ్యాప్ ఉంది కాబట్టి హిట్ టాక్ వచ్చినా కానీ ‘ఏజెంట్’ విడుదలయ్యే సమయానికి విరుపాక్షకి బజ్ తగ్గే అవకాశం ఉంది. మరో పక్క ఏజెంట్ రిలీజ్ రోజే పొన్నియన్ సెల్వన్2 ఉన్న కానీ,  ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి నష్టమేమీ లేదు.

ఇక నాగచైతన్య సినిమా ‘కస్టడీ’ రిలీజ్ సమయానికి కూడా తెలుగు నుండి పెద్ద సినిమాలేవీ లేవు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా మే 12న విడుదలవ్వాల్సి ఉండగా అది వాయిదా పడ్డట్టు వార్తలొచ్చాయి కాబట్టి, నాగచైతన్యకు కావాల్సినన్ని థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంది. సమ్మర్ సీజన్ పైగా సెలవుల సీజన్ కావటంతో బ్రదర్స్ ఇద్దరి సినిమాలు కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా సినిమాలు మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి, ఈ సారైనా అక్కినేని వారసులు ఎంతగానో ఎదురుచూస్తున్న హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు