Akhil: స్పీడ్ పెంచిన ‘ఏజెంట్’..!

అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వస్తున్న  ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి సమయం దగ్గరపడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హీరో అఖిల్ డేరింగ్ ఫీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక షాపింగ్ మాల్ పైకి ఎక్కి సుమారు 170 అడుగుల పై నుండి దూకి స్టంట్ చేసాడు. అన్ని జాగ్రత్తలు తీసుకొని రోప్ సాయంతోనే దూకినప్పటికీ ఇలా ఇంతకు ముందు ఎవరూ సాహసించలేదు. ప్రీరిలీజ్ లాంటి ఈవెంట్ సమయాల్లో స్టేజ్ మీదకు ఇలా పై నుండి దిగటం గతం పలువురు హీరోలు చేశారు కానీ, ఇలా అవుట్ డోర్ అంత ఎత్తు నుండి ఈ ఫీట్ చేసింది మాత్రం అఖిల్ అనే చెప్పాలి.

షూటింగ్ మొదలైన నాటి నుండి పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పడు కూడా వాయిదా పడుతుంది అంటూ ఊహాగానాలు వచ్చాయి ఒక దశలో. అలాంటి ఉహాగానాలన్నిటికీ నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర, హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి. సినిమా పలుమార్లు వాయిదా పడటం మొదలుకొని, హీరో డైరెక్టర్ మధ్య విభేదాల వరకు అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే, రిలీజ్ కి రెండు వారాల సమయం కూడా లేని టైమ్ లో ప్రమోషన్స్ మొదలు పెట్టిన సినిమా యూనిట్ ఎలా అయినా ఆలస్యం అవ్వటం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే అఖిల్ ఈ రేర్ ఫీట్ చేసేందుకు సిద్దమై ఉండచ్చు. ఏదేమైనా ప్రమోషన్స్ అంటే వినూత్న రీతిలో ఆడియెన్స్ ఆకట్టుకోవాలన్న తపన ఉండచ్చు కానీ, ఇలా రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్ లు చేస్తే సినిమా కోసం ఇన్నాళ్ల పాటు పడ్డ కష్టం అంతా వృధా అవుతుందన్న విషయం గమనించాలి. సినిమా మీద గట్టి నమ్మకంతో ఉన్న ‘ఏజెంట్’ అండ్ కో తమ లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు