Hansika Motwani: హన్సికకు ఆ అలవాటు ఉందట..!

Hansika Motwani

దేశముదురు సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మరాఠీ ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. మొదటి సినిమాతోనే తెలుగు యువత గుండెల్లో బలమైన ముద్ర వేసిన ఈ చబ్బీ చీక్స్ చిన్నది తెలుగు టాప్ హీరోయిన్ స్థానాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా కోలీవుడ్ సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

ప్రస్తుతం మైత్రి  ( MY3 ) వెబ్ సిరీస్ లో నటించిన హన్సిక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అలవాట్ల గురించి ఆసక్తికర అంశాన్ని బయట పెట్టింది. తనకు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు చూడటం చాలా ఇష్టం అని, ఒకసారి వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోనని చెప్పింది.

ఒకప్పుడు రొమాంటిక్ మూవీస్ బాగా చూసేదాన్నని, ఒకసారి ఫారిన్ వెళ్ళినప్పుడు ఓ రొమాంటిక్ సిరీస్ స్టార్ట్ చేసి అలాగే చూస్తూ హోటల్ రూమ్ లో ఉండిపోయానని, అప్పటి నుండి ఈ సిరీస్ ల పిచ్చి మొదలైందని వెల్లడించింది హన్సిక. దీంతో హన్సిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘తెనాలి రామక్రిష్ణ’ సినిమా తర్వాత హన్సిక మరే తెలుగు సినిమాలో కనిపించలేదు, ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తున్న హన్సిక ఇకపై సినిమాలకు ఓటీటీకి సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. మరి, తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు సాధించిన హన్సిక వెబ్ సిరీస్ ల ద్వారా అయినా తెలుగులో కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు