Rajdhani Files: ఓటీటీ వద్దు.. యూట్యూబే ముద్దు అంటున్న రాజధాని ఫైల్స్.. డైరెక్ట్ ఎటాక్..!

Rajdhani Files: రాజధాని ఫైల్స్ ఓటిటి రిలీజ్ డేట్ కోసం ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వారందరికీ ఇప్పుడు బిగ్ గుడ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కాకుండా యూట్యూబ్లో రిలీజ్ చేయనున్నారు. ఎటువంటి సబ్స్క్రిప్షన్ చార్జీస్ లేకుండా ఫ్రీగా రాజధాని ఫైల్స్ మూవీ ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు అని మేకర్స్ ప్రకటించారు.

ఏపీ రాజకీయాలపై తీసిన ఈ మూవీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపింది. భాను దర్శకత్వం వహించిన ఈ మూవీలో అఖిలన్, వీణ, వినోద్ కుమార్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. అమరావతి విషయంలో రైతులకు ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాజధాని ఫైల్స్ మూవీ రూపొందింది. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి వారికి నిరాశ మిగిలింది.

Rajdhani files streaming in YouTube
Rajdhani files streaming in YouTube

ఏపీ సీఎం జగన్ మరియు కొడాలి నానితో పాటు పలువురు నాయకుల వ్యక్తిగతాన్ని కించపరిచేలా ఈ సినిమాలో సీన్స్ ఉన్నాయని.. వాటిపై సినిమా యూనిట్ వివరణ ఇచ్చే వరకూ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు కోర్టును ఆశ్రయించారు. థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సినిమా స్ట్రీమింగ్ ను అడ్డుకున్నారు. ఇక చివరికి కోర్టు ద్వారా స్తే తీసుకొచ్చి సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇక ఈ మూవీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్లోకి వచ్చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు