Venkatesh: కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగిన విక్టరీ వెంకటేష్.. ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి అంటూ డైలాగ్స్..!

Venkatesh: సినీ రంగంలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి రాణిస్తున్న హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఇక తాజాగా వెంకటేష్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో కమాన్ ఖమ్మం అంటూ వెంకీ మామ సందడి చేశారు. తన వియ్యంకుడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో వెంకటేష్ రోడ్డు షో నిర్వహించారు.

victory-venkatesh-who-entered-the-arena-to-support-congress
victory-venkatesh-who-entered-the-arena-to-support-congress

ఖమ్మం మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్, జేడ్పీ సెంటర్ మీదగా కాంగ్రెస్ పార్టీ రోడ్డు షో కొనసాగించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, ఎంపీ రేణుక చౌదరితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

ఇక ఈ ప్రచారంలో వెంకటేష్ ను చూసేందుకు పలువురు తరలివచ్చారు. అమ్మ.. అక్క.. బాబు.. తాత.. చెల్లి.. తమ్ముడు.. ఈవీఎం లో మూడో నెంబర్ గుర్తుందా.. మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికలలో మన ఆర్ఆర్ఆర్ కి ఓటు వేసి గెలిపించండి. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘు రాముడు.. అంటూ భారీ డైలాగ్స్ తో తమ పార్టీని ప్రమోట్ చేశాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు