Partner OTT: రెండు ఓటీటీలపై కాలు పెట్టిన హన్సిక కన్ఫ్యూజన్ మూవీ.. డీటెయిల్స్ ఇవే..!

Partner OTT: హన్సిక, ఆది పినిశెట్టి.. ప్రధాన పాత్రల్లో నటించిన పార్ట్నర్ మూవీ బుధవారం ఓటిటి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆహా తమిళ్ ఓ టి టి లో ఈ కామెడీ మూవీ రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ తమిళ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తాజాగా ఆహా తమిళ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

ఈ నెలలోనే పార్టనర్ మూవీ తెలుగులోనూ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఆహా ఓటీపీ లోనే విడుదల అవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగు వర్షన్ ఓటీపీ రిలీజ్ డేట్ ను తొందర్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయనున్నారు. ఇక పార్ట్నర్ మూవీ కి మనోజ్ దామోదరం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి.. హన్సిక తో పాటు యోగి బాబు, పలక్ కీలక పాత్రలు పోషించారు.

Hansika's Confusion movie which has set foot on two OTTs
Hansika’s Confusion movie which has set foot on two OTTs

ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం కారణంగా ఓ అబ్బాయి మరియు అమ్మాయిగా మారడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. పాయింట్ కొత్తగా ఉన్న ఆశించిన స్థాయిలో అయితే కామెడీ పండకపోవడం వల్ల ఈ మూవీ పెద్దగా ప్రశంసలు అందుకోలేకపోయింది. గత ఏడాది ఆగస్టులో పార్ట్నర్ మూవీని తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో తెలుగు వర్షన్ వాయిదా పడింది. అలా తమిళ్ లో ముందు రిలీజ్ అయింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఏకంగా రెండు ఓటీటీలలో అడుగుపెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు