Skanda Pre – Release Event: శ్రీలీల దుమ్ము దులిపేసింది..!

Skanda Pre – Release Event

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా బోయపాటి డైరెక్షన్లో రూపొందిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా కండక్ట్ చేసింది.

బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వటంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అయితే, ఈవెంట్ మొత్తానికి హీరోయిన్ శ్రీలీల సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. ఈవెంట్ లో తెలుగులో క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకోవటమే కాకుండా తమన్ తో కలిసి సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇన్నాళ్లుగా యాక్టింగ్, డ్యాన్స్ తో కుర్రకారు మతి పోగొట్టిన శ్రీలీల ఇప్పుడు సింగింగ్ లో కూడా తన సత్తా చాటడంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా బోయపాటి మార్క్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్ కి చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటంతో స్కంద సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకొని ఆ పరంపరను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. మరి, రామ్ ని కొత్త యాంగిల్ లో చూపించిన బోయపాటి ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు