Naga Chaitanya’s Next: ఇది నిజమే అయితే, నాగచైతన్య కి బ్లాక్ బస్టర్ పడినట్టే..!

Naga Chaitanya’s Next

నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. జాలర్ల జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం యూనిట్ కొంతకాలంగా సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటిస్తూ రీసర్చ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాసు, డైరెక్టర్ చందులతో కలిసి సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి జాలర్లతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి జాలర్ల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నాడు నాగచైతన్య.
పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి అనుకోకుండా వెళ్లి పాకిస్తాన్ చెరలో బంధింపబడ్డ జాలర్ల కథ ప్రధానంగా ఈ సినిమా రూపొందనుందని వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరొక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని డైరెక్టర్ చందు సంప్రదించాడని, ఇందుకు అనిరుధ్ కూడా ఓకే అన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమే అయితే నాగచైతన్య నెక్స్ట్ సినిమా సగం బ్లాక్ బస్టర్ అయినట్టే అని చెప్పాలి. బ్యాక్డ్రాప్ పరంగానే ఆసక్తి పెంచుతున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ గనక యాడ్ అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇటీవల కస్టడీ సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న నాగచైతన్యకి ఎక్కువ గ్యాప్ లేకుండా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వటం లక్ అయితే, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అవ్వటం డబల్ లక్ అని చెప్పాలి. మరి, తన బీజీఎమ్ తో యావరేజ్ సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లగల అనిరుధ్ చైతూకి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు