Samantha at New York: హాలిడేలోనూ దేశభక్తి చాటుకున్న సమంత..!

Samantha at New York

లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి హాలిడే వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలో రిలాక్స్ అవుతున్న సమంత రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. హాలిడే రిలాక్స్ అవ్వటమే కాకుండా దేశభక్తి చాటుకుంది సమంత. న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ కండక్ట్ చేసిన ఇండిపెండెన్స్ డే పరేడ్ ఇండియాని రిప్రెజెంట్ చేస్తూ పాల్గొంది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సమంత ఈ అవకాశం కల్పించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ కి థ్యాంక్స్ చెప్పింది.
ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత విశ్రాంతి కోసం కొంత గ్యాప్ తీసుకుంటున్నానని తిరిగి వచ్చాక మునుపటిలాగానే కష్టపడి బ్లాక్ బస్టర్స్ ఇస్తానని చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.
ఖుషి సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లైగర్, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ ఉన్న విజయ్, సమంత లకు ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ట్రైలర్ లో సమంత, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలువగా సినిమాకు కూడా అదే ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు