Director Praveen Sattaru: యాంకర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు..!

Director Praveen Sattaru

LBW సినిమా ద్వారా దర్శకుడిగా మారిన ప్రవీణ్ సత్తారు గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రవీణ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రవీణ్ ని కాంట్రవర్సియల్ క్వశ్చన్ అడిగిన యాంకర్ కి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాను డైరెక్ట్ చేసే సినిమాలకు బడ్జెట్ కంట్రోల్ ఉండదని, అదుపు తప్పిన బడ్జెట్ తో నిర్మాతలకి తలనొప్పిగా మారతారని టాక్ ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.
తనతో ఇప్పటిదాకా సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ లో ఎవరు ఈ మాట అన్నారో చెప్పండని అంటూ తిరిగి యాంకర్ ని ప్రశ్నించాడు ప్రవీణ్. సినిమా బడ్జెట్ అన్నది డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి సంబందించిన అంశం అని, ఆ వివరాలు మీకెలా తెలుస్తాయంటూ ప్రవీణ్ సత్తారు అడిగిన ప్రశ్నకి సదరు సీనియర్ జర్నలిస్ట్ తెల్ల మొహం వేసాడు.
ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య, డైరెక్టర్ కి హీరోకి మధ్య, ప్రొడ్యూసర్ కి హీరో కి మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా కూడా వెబ్సైట్ లో క్లిక్స్ కోసం అలాంటి గాసిప్స్, రూమర్స్ రాస్తుంటారని, అది మంచి పద్దతి కాదని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు ప్రవీణ్ సత్తారు. అంతే కాకుండా ఇంకా చాలా అంశాల మీద సీనియర్ జర్నలిస్ట్ కి ప్రవీణ్ కౌంటర్స్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు