#NationalFilmAwards2023: వై నాట్ ఎన్టీఆర్, రామ్ చరణ్..?

#NationalFilmAwards2023

తాజాగా ప్రకటినుంచిన నేషనల్ అవార్డ్స్ లో పుష్ప సినిమాలో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్యాటగిరిలో సౌత్ నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, సూర్య నామినేట్ కాగా, అల్లు అర్జున్ ను ఈ అవార్డు వరించింది. దీంతో తెలుగు హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు.ఇదిలా ఉండగా బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ని సెలెక్ట్ చేయటంఫై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ తో పోలిస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏమంత గొప్పగా యాక్ట్ చేయలేదని కామెంట్ చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్.
పుష్ప సినిమాలో బిగినింగ్ టు ది ఎండ్ అల్లు అర్జున్ ఒకే స్టైల్ లో యాక్టింగ్ ఉంటుందని, పెద్దగా వేరియేషన్స్ కూడా ఉండవని అంటున్నారు. RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సెంటిమెంట్, యాక్షన్, ఇన్నోసెన్స్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ చూపించారని, ఇద్దరిలో ఒకరికైనా బెస్ట్ యాక్టర్ అవార్డు రావాల్సిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో RRR సినిమాకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని భావించి నిరాశకు గురైన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి నేషనల్ అవార్డు రూపంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఏది ఏమైనా ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాల డామినేషన్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వరుస పాన్ ఇండియా హిట్స్ తో RRR సినిమాతో ఆస్కార్ స్థాయికి ఎదిగిన టాలీవుడ్ కి ఈ నేషనల్ అవార్డ్స్ మరింత బూస్టప్ ఇస్తుందని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు