Kethika Sharma: “బ్రో” లో ఈ హీరోయిన్ రోల్ ఏంటి?

“బ్రో” సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. రెండు వారాల ముందు వరకు ఈ సినిమా కి సంబంధిచిన మోషన్ పోస్టర్ తప్ప ఏది రాలేదు. కానీ టీజర్ విడుదలైన దగ్గరి నుండి వారానికో అప్డేట్ తో వెంట వెంటనే రిలీజ్ చేస్తున్నారు. ముందుగా బ్రో టీజర్ విడుదల కాగా, ఆ వెంటనే బ్రో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా, ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ ని కూడా లాంచ్ చేసారు.

తిరుపతి లో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ సముద్రఖని చిత్ర యూనిట్ కలిసి ఈ సాంగ్ ని విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ బ్రో సినిమాలో ఇంతకు ముందే టీజర్ వచ్చినపుడు ప్రియా ప్రకాష్ వారియర్ సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటిస్తుందని తెలిసిందే. అయితే తాజగా రిలీజ్ చేసిన సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కేతిక శర్మ డాన్స్ చేసింది. ఈ సాంగ్ ని గమనిస్తే ఈ భామ సాయి ధరమ్ తేజ్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుందని కొందరు, మరికొందరు తన ఆఫీస్ లో మేనేజర్ గా పని చేస్తూ హీరోని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే బ్రో లో కేతిక శర్మది ఎలాంటి రోల్ అయినా, కథకి మాత్రం కీలకమైన పాత్రే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక రిలీజ్ అయిన సాంగ్ లో మాత్రం సాయి ధరమ్ తేజ్ తో కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. ఫస్ట్ మూవీ లో తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో జతకట్టిన కేతిక శర్మ ఇప్పుడు బ్రో మూవీ లో అన్న సాయిధరమ్ తేజ్ తో చిందాడింది. ఇక బ్రో సినిమా జులై 28న విడుదల అవబోతుండగా, జూలై23 లేదా 24న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు