Mahesh: గౌతమ్ హీరోగా ఎంట్రీ ఎప్పుడంటే – నమ్రతా క్లారిటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కొడుకు గౌతమ్ ఘట్టమననేని సినీ రంగ ప్రవేశం పై నమ్రతా శిరోద్కర్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలనే పిఎంజే జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిటర్ గా ఆమె కూతురు సితార డిజిటల్ డెబ్యూ ఇవ్వగా, ఇక గౌతమ్ ఎప్పుడు సినిమాలలోకి అడుగుపెడతాడని సర్వత్రా ఆసక్తి మొదలైంది.

నిన్నజరిగిన పిఎంజే జ్యువెలర్స్ లుక్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత మరియు సితార ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నోత్తరాల సెషన్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకుసమాధానాలు ఇవ్వడంతో పాటు గౌతమ్ డెబ్యూ సినిమా ఎప్పుడో కూడా చెప్పేసింది.

సాధారణంగా స్టార్ కిడ్స్ పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారని అందరు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇటీవలనే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా చిన్న వయసులో నే స్క్రీన్ లో కనిపించి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేయగా ఇక ఇప్పుడు సితార కూడా స్టార్ కిడ్స్ లో డెబ్యూ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ లో చేరిపోయింది.

- Advertisement -

అయితే వీరి ఇద్దరి సంగతి ఎలా ఉన్న టాలీవుడ్ ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా ఎదురు చూసేది హీరోల కొడుకులు హీరోలుగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కొడుకులు కాస్త ఏజ్ కు వచ్చేసరికి వీరిద్దరూ హీరోలుగా ఎప్పుడు స్క్రీన్ పై కనిపించబోతున్నారని ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ విషయాన్నే నమ్రతాను గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అడగగా ఆమె గౌతమ్ ఇంకా చదువుకోవాలని తనకు ఇప్పుడు కేవలం 16 ఏళ్ళు మాత్రమే అని చెబుతూ, తన గ్రాడ్యుయేషన్ కంప్లిట్ అవడానికి ఇంకో 8 ఏళ్ళైనా పడుతుంది. ఆ తరువాత గౌతమ్ సినిమాల్లోకి వస్తాడని, ఇప్పుడప్పుడే గౌతమ్ ను సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన లేదంటూ ఆమె సమాధానం ఇచ్చింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు