Aditi Shankar: “మహావీరుడు” హీరోయిన్ ఆ టాప్ డైరెక్టర్ కూతురని తెలుసా?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “మహావీరుడు” కూడా ఒకటి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా జులై 14న విడుదలై మిక్సిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయినా కూడా కామెడీ బాగుండడంతో జనాలు బాగానే థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమాలో “అదితి శంకర్” అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించింది. సినిమాలో పాత్ర పరంగా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ ఈ హీరోయిన్ తన పెర్ఫార్మన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ హీరోయిన్ గురించి ఆరా తీస్తే అదితి శంకర్ ఒక టాప్ డైరెక్టర్ కూతురని తెలిసింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ షణ్ముగం. అవును.. ఈ డైరెక్టర్ యొక్క కూతురే అదితి శంకర్. శంకర్ కూతురైనప్పటికీ ఆ విషయం ఎక్కడా చెప్పకుండా, తన టాలెంట్ తోనే ముందుగా మూవీస్ చేసింది ఈ భామ. ఇక కార్తీ నటించిన విరుమాన్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, రెండో సినిమాగా మహావీరుడు చేసింది.

ఇక ఈ సినిమాకి ముందే సింగర్ గాను పాటలు పాడిన అదితి శంకర్ ఫస్ట్ సాంగ్ తెలుగు సినిమాలోనే పాడటం విశేషం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన “గని” సినిమాలో రోమియో జూలియెట్ అనే పాడింది అదితి. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో పాట గురించి కూడా ఎక్కువ మందికి తెలియలేదు. ఇక ప్రస్తుతం మహావీరుడు ప్రమోషన్లలో బిజీ గా ఉన్న ఈ భామ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అటు డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు