AAA: ఆన్ స్క్రీన్ మహేష్ బాబు- ఆఫ్ లైన్ లో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆన్ స్క్రీన్ మహేష్ బాబును గట్టిగ ఫాలో అవుతున్నాడు. అదెలా అనుకుంటున్నారా..? మహేష్ ఏమో ఆన్ స్క్రీన్ లో బిజినెస్ మ్యాన్ అయితే ఆఫ్ లైన్ లో మాత్రం ఈ వైఖరి అల్లు అర్జున్ లో కనిపిస్తుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా అయినా పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఒక పక్క వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరో పక్క వరుస వ్యాపారాలను కూడా లైన్ లో పెడుతున్నాడు.

ఇప్పటికే అల్లు స్టూడియోస్, ఆహా ఓటిటి, లకు ఓనర్ గా మరియు ఫుడ్ బిజినెస్, , ట్రిపుల్ ఏ సినిమాస్(AAA) వంటి వాటిల్లో భాగస్వామిగా కొనసాగుతున్న అల్లు అర్జున్. ఇప్పుడే ఈ వ్యాపారాలకు అల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయాలనీ చూస్తున్నడట.

- Advertisement -

అసలు విషయమేంటంటే అల్లు అర్జున్ ఇటీవలనే ట్రిపుల్ ఏ సినిమాస్ పేరిట హైద్రాబాద్ లోని అమీర్ పెట్ లో థియేటర్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమాగా ఈ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా ప్రదర్శింపబడింది. అయితే ఎంత కాలంగా ఊరిస్తున్న ఈ థియేటర్ ఇటీవలనే ఓపెన్ చేయబడి మంచి అంబియెన్స్ తో ప్రేక్షకులను, చూపరులను ఆకట్టుకుంటుంది.

ఇక అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్ థియేటర్స్ ను ఇప్పుడు ఏపీలో కూడా లాంచ్ చేయడానికి చూస్తున్నాడట. దీనికి సంబందించిన పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాని టాక్ నడుస్తుంది. ఇక హైద్రాబాద్ లో కూడా అమీర్ పెట్ తరహా ఏరియాస్ లో ట్రిపుల్ ఏ సినిమాస్ థియేటర్స్ ను విస్తరించబోతున్నట్టు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా వైఖరి అల్లు అర్జున్ లో కనిపిస్తున్నట్టుంది. హీరోగా సక్సెస్ అయిన అల్లు అర్జున్ మరీ బిజినెస్ మ్యాన్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు