VD13: ఫస్ట్ షెడ్యూల్ లోనే అడుగుపెడుతున్న మృణాల్?

టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అవుతుంది. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత మృణాల్ కి తెలుగులో మంచి పెర్ఫార్మన్స్ ఉన్న పాత్రలే దొరుకుతున్నాయని తెలుస్తుంది. మొన్నటివరకు నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో తెలుగు సినిమా షూటింగ్ లో బిజీ అవనుంది. అదే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 13వ సినిమా.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత నెలలో గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం నుండే జరుగుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కూడా ఫస్ట్ షెడ్యూల్ లోనే అడుగుపెట్టనుందని సమాచారం. ఇక ఈ విషయాన్నీ తెలుపుతూ మృణాల్ ఠాకూర్ ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది.

ఆ స్టేటస్ లో సనాక్రాంతికి తమ సినిమా రూపంలో గ్రేట్ ఫెస్టివల్ ని అందించబోతున్నామని, ఇక సెట్స్ లో అడుగుపెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటుల వివరాలు తెలియలేదు. గోపి సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, 2024 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.’

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు