Adi Purush: ఓం రౌత్ ఇంకా మారలేదా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆది పురుష్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫైల్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . పూర్తిగా బాలీవుడ్ తారాగణం తో తీస్తున్నఈ  సినిమాలో శ్రీ రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ఆంజనేయుడిగా దేవదత్త , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

అజయ్- అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కి విడుదలవ్వాల్సిన ఈ సినిమా జూన్ 16 కు వాయిదా పడింది. దీనికి చిత్ర దర్శకుడు ఓం రౌతే కారణం. ఆ మధ్య 3డి లో విడుదలైన ఆది పురుష్ టీజర్ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. రామాయణం ను వక్రీకరించారని, రాముడిగా ప్రభాస్ ను చూపించిన విధానం బాగాలేదు అని, ఇంకా రావణుడు, ఆంజనేయుడి పాత్రల గెటప్ ముస్లిం లుక్స్ లాగా ఉన్నాయని ట్రోల్స్ వచ్చాయి. అంతే కాదు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కూడా అస్సలు బాగాలేదని, ఏదో యానిమేషన్ సినిమాలా ఉందని ఫ్యాన్స్ ఓం రౌత్ పైన చాలా మండిపడ్డారు.

అందుకే ఈ సినిమా ను ఏకంగా 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేసి గ్రాఫిక్స్ పైన మరోసారి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ చాలావరకు దాటిపోగా మరో వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు.

- Advertisement -

తాజాగా శ్రీ రామ నవమి సంధర్బంగా ఈ సినిమా నుంచి మరో స్టిల్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ స్టిల్ కూడా ఏమి బాగాలేదని, సినిమా వర్కింగ్ లో ఓం రౌత్ అసలేమి చేంజ్ చేయలేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక కామన్ ఆడియన్స్ కూడా రాముడు కవచం ధరించడం ఏంటి, సీత శాలువా వేసుకోవడం ఏంటి, లక్ష్మణుడు గడ్డం తో ఉండడం ఏంటి అని విమర్శిస్తున్నారు.

అసలు రామాయణం ఇలా ఉంటుందని ఎవరు చెప్పకపోయినా, ప్రజల మనస్సుల్లో మాత్రం ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇలా సినిమాలో వక్రీకరించి తీస్తే ప్రజలనుండి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రామాయణం మీద సినిమా తీస్తున్న ఓం రౌత్ కు ఇంత చిన్న విషయం బోధ పడలేదా అంటూ పబ్లిక్ ఫైర్ అవుతున్నారు.

ఓం రౌత్ ఇప్పటికైనా తేరుకొని సినిమా గ్రాఫిక్స్ పైన ఇంకా నటీనటుల పాత్రల గెటప్ పైన శ్రద్ధ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్ దాటిపోయిన సినిమా, రిలీజ్ అయ్యే నాటికీ ఇంకా ఎంత ఓవర్ బడ్జెట్ అవుతుందో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు