Tamannaah Bhatia : తమన్నా తో డేటింగ్ చేయడం.. విజయ్ వర్మ కామెంట్స్ వైరల్

Tamannaah Bhatia

మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో బాగా పాపులరైన ఈ జంట పబ్లిక్ గానే రెస్టారెంట్స్ కు, పబ్ లకు వెళ్లడంతో వీరిద్దరి పిక్స్ సోషల మీడియాలో ట్రెండ్ అవడం మొదలయ్యాయి. తమన్నా కూడా ఈ విషయం అందరికి తెలిసిపోయిందని గ్రహించి, ఇక దాగుడుమూతలకు పుల్ స్టాప్ పెట్టి బహిరంగంగానే విజయ్ వర్మ గురించి ప్రెస్ మీట్ లలో మాట్లాడటం స్టార్ట్ చేసింది.

తమన్నా, విజయ్ వర్మ జంటగా నటించిన లస్ట్ స్టోరీస్ పార్ట్ 2 కూడా కొద్దీ రోజుల క్రితమే రిలీజై, వీళ్లా ప్రేమ ఎంత ఘాటు ప్రేమనో తెలియజేసింది. ఇక లేటెస్ట్ గా విజయ్ వర్మ కూడా తమన్నా తో డేటింగ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నిజానికి తాను పరిశ్రమలో ఉన్న ఏ అమ్మాయి తోను రిలేషన్ షిప్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. కానీ ఎందుకో తమన్నాను చూసాక ప్రేమించకుండా ఉండలేకపోయాను అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.

తమన్నాతో ప్రేమ తన ఆలోచనను పూర్తిగా మార్చేసిందని విజయ్ వర్మ అన్నాడు. అప్పటి వరకు తాను పెట్టుకున్న డేటింగ్ రూల్ ను కూడా తమన్నాతో బ్రేక్ చేయవలసి వచ్చిందని, తమన్నా అంటే తనకు అంత ఇష్టం అంటూ ఆయన అన్నాడు. తమన్నానే నా జీవిత భాగస్వామి అని చెప్పుకొచ్చాడు. విజయ్ వర్మ వ్యవహారం చూస్తుంటే.. తమన్నాతో పీకల లోతు ప్రేమలో మునిగిపోయినట్టు అర్థమవుతోంది. పెళ్లి అయ్యేదాకా నమ్మకం లేనటువంటి బాలీవుడ్ నటుల లవ్ స్టోరీస్ గురించి అందరికి తెలిసిందే. కాగా మరీ తమన్నా విజయ్ వర్మ ప్రేమ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ఇటీవలనే ఆమె భోళా శంకర్, జైలర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు