JD. Chakravarthy: వేల కోట్ల ఆస్తి నుంచి రోడ్డున పడ్డాడు.. కారణం..?

ఒకప్పుడు స్టార్ హీరోలకు దీటుగా తమ సినిమాలను చేసి మంచి పాపులారిటీ సంపాదించారు హీరో జే.డీ.చక్రవర్తి.. ఎన్నో వైవిధ్యమైన కథలతో.. కంటెంట్ ఉన్న సినిమాలతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించి మెప్పించారు.. గత ఏడాది దయా అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక రెగ్యులర్ గా సినిమాలు చేస్తానంటూ కూడా తెలియజేశారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జే.డీ.చక్రవర్తి తన గతం గురించి పలు విషయాలను తెలియజేశారు..

తన నిజ జీవితంలో రాయల్ లైఫ్ ని అనుభవించానని కానీ ప్రస్తుతం రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని.. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియజేశారు…. జెడి చక్రవర్తికి హైదరాబాదులో కొన్ని వందల కోట్ల విలువ చేసే భూమి ఉందని.. రాజమండ్రి లో కూడా వేల ఎకరాల భూమి ఉందని.. ఎన్నో కోట్ల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి అంటూ వార్తలు ప్రచారంలో వున్నాయి.. నిజమేనా..? అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అందుకు జేడీ చక్రవర్తి నవ్వుతూ అవన్నీ ఎక్కడ ఉన్నాయి..? అడ్రస్ ఇస్తే తెచ్చుకుంటానంటూ రియాక్ట్ అయ్యారు..

అలాంటివన్నీ ఏమీ లేవు కానీ తన పదమూడేళ్ల వయసులో తన తండ్రి మరణించారని.. దీంతో తన తల్లి అంతా చూసుకునేదని వెల్లడించారు.. రాత్రి తనతో పడుకున్న నాన్న ఉదయం లేవగానే లేకపోవడంతో ఆ బాధ తనను చాలా బాధ పెట్టిందని తెలిపారు.. ఆ వయసులో ఈ బరువు బాధ్యతలు పెద్దగా ఎరుగని తాను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాన్ని అంటూ వెల్లడించారు.. తన తల్లి కూడా చాలా బాధగా భారంగా ఫీల్ అయ్యేదని.. తన తల్లి పేరు కోవెల శాంత అంటూ తెలిపారు.. తన తల్లి ఇండియాలోనే హెల్తీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని తెలిపారు..

- Advertisement -

అయితే భర్త చనిపోయిన తర్వాత తన భార్యకు ఆస్తి రావాలంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ కావాలని.. ఆ సమయంలో అమ్మ అది తీసుకుందామని వెళ్లగా.. ఆయనకు ఫస్ట్ వైఫ్, లాస్ట్ వైఫ్ అన్నీ ఆమె అని ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తే.. తన తండ్రి ప్రాపర్టీ మొత్తం తమకు వస్తాయని తెలిపారట.. అయితే ఆ సర్టిఫికెట్ కోసం తన తల్లి దాదాపుగా రెండేళ్లు కష్టపడిందని.. అప్పట్లో ఒక ఎకరా పొలంలో ఇల్లు ఉండేదని.. పని వాళ్లు కూడా ఉండేవారని లగ్జరీ హౌస్ అని రాయల్ లైఫ్ గా ఉండేదని కానీ తన తండ్రి చనిపోయాక అవన్నీ పోగొట్టుకున్నట్లు తెలిపారు. లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ వచ్చేవరకు చిన్న ఇంట్లో రెంట్ కు ఉన్నామని.. దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.

ఒకరకంగా చెప్పాలి అంటే రాయల్ లైఫ్ నుంచి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయింది అంటూ తెలిపారు. రెండేళ్ల తర్వాత తన తండ్రి ఆస్తి మొత్తం తమకే వచ్చిందని వెల్లడించారు.. శివ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చానంటూ ..రాంగోపాల్ వర్మ శిష్యుడుగా ఆయన ఎన్నో చిత్రాలలో నటించాను అంటూ తెలిపారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు