Tollywood : థియేటర్లో ఒకటి.. ఓటిటి లో మరొకటి.. బెస్ట్ ఆప్షన్స్

టాలీవుడ్ లో ఈ వారం అరడజనుకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అన్ని చిన్న సినిమాలే కావడం వల్ల టికెట్ రేట్లు కూడా రీసనల్ గా ఉన్నాయి, అన్నిటికి మించి డిఫెరెంట్ జోనర్లలో సినిమాలు వస్తున్నాయి కాబట్టి, మూవీ లవర్స్ కి ఏదో ఒక సినిమాను ఎంచుకునే ఛాన్స్ తో కనీసం రెండు మూడు సినిమాలకి మంచి టాక్ వస్తుంది అనుకున్నారు నెటిజన్లు. ఇక ఈ వారం తంత్ర, షరతులు వర్తిస్తాయి, వెయ్ దరువెయ్, లంబసింగి, రజాకార్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ అయిన ఈ అన్ని సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. అయితే వీటిలో ఒక్కటంటే ఒక్క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. రిలీజ్ అయిన అరడజను సినిమాల్లో ఒక్క రజాకార్ సినిమాకి ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ వారం థియేటర్లలో అదే బెస్ట్ ఆప్షన్ గా మారింది.

రజాకార్ థియేటర్లలో బెస్ట్ ఆప్షన్..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో రజాకార్ సినిమా ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా తెలంగాణ రజాకార్ల హింసల నేపథ్యంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం కావడం, అందునా రియల్ స్టోరీ కావడం వల్ల ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా విజువల్స్ పూర్ గా ఉండడం వల్ల, అందులోనూ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోకపోవడం వల్ల సినిమాపై మరీ అంతగా టాక్ రాలేదు. కానీ చివరి అరగంట మెప్పించడంతో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తుంది. ఇక ఈ సినిమా ఎక్కడ ఆడినా ఆడకపోయినా, తెలంగాణ లో ఓ మోస్తరు జనాలు ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చు. దర్శకుడు యాటా సత్యనారాయణ స్క్రీన్ ప్లే పరంగా మెప్పించకపోయినా ఎమోషనల్ డ్రామాని పండించడం వల్ల కనెక్ట్ కావచ్చు. అయితే థియేటర్లో ఈ సినిమా తప్పితే వేరే సినిమా ఏది సరైన రెస్పాన్స్ తెచ్చుకోకపోవడం గమనార్హం. అది ఈ సినిమాకి ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే రజాకార్ సినిమాతో కూడా సంతృప్తి చెందని ఆడియన్స్ కి ఒక ఓటిటి వెబ్ సిరీస్ మంచి ఆప్షన్ గా మారింది.

- Advertisement -

ఓటిటి బెస్ట్ ఆప్షన్ సేవ్ ది టైగెర్స్ 2..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో థియేటర్లలో పెద్దగా ఏ సినిమా కూడా మెప్పించలేదు. ఉన్నంత లో రజాకార్ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ఎమోషనల్ డ్రామాగా కొందరు ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అయితే ఈ సినిమా కూడా చూసి సంతృప్తి చెందని ఆడియన్స్ కి హాట్ స్టార్ ఓటిటి లో వచ్చిన సేవ్ ది టైగర్స్ కామెడీ వెబ్ సిరీస్ మంచి ఆప్షన్ గా మారింది. లాస్ట్ ఇయర్ పార్ట్ వన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించగా, లేటెస్ట్ గా మార్చి 15న రెండో పార్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండి రెండో పార్ట్ మొదలయింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, అభినవ్ గోమటం పండించిన కామెడీ వేరే లెవెల్ లో ఆకట్టుకుంటుంది. కామెడీ డ్రామా కాబట్టి సమ్మర్ లో అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. వీళ్ళే కాకుండా ముక్కు అవినాష్, రోహిణి కామెడీ కూడా నవ్విస్తుంది. ఓవరాల్ గా థియేటర్లలో సంతృప్తి చెందని తెలుగు ఆడియన్స్ కి ఈ సిరీస్ మంచి ఆప్షన్ గా నిలిచింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు