Razakar Movie Review and Rating: రజాకార్ మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ ను గమనిస్తే.. అందులో ‘రజాకార్’ మూవీ కూడా ఉంటుంది. కానీ అనేక సార్లు సినిమా విడుదల వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గిపోయింది అనేది కూడా నిజం. యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమాలో బాబీ సింహా, అనసూయ, వేదిక, ఇంద్రజ వంటి స్టార్స్ నటించారు. మొత్తానికి ఈరోజు అనగా మార్చి 15 న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ:
1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే భారత దేశంలో మేము భాగం కామని, హైదరాబాద్ సంస్థానాన్ని మేమే స్వాతంత్య్ర రాజ్యంగా పాలించుకుంటామని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్‌పాండే) ప్రకటిస్తాడు. అతని సపోర్ట్ తో ఖాసీం రజ్వీ (రాజ్ అర్జున్) రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసి హిందువులపై దాడులకు పాల్పడతారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలని హిందువులను చిత్ర హింసలు చేయడం ఇందులో ఓ భాగం. కాదని ఎవరైనా ఎదురుతిరిగితే క్రూరంగా ప్రాణాలు తీయడం, మహిళలలను అయితే మానభంగం చేసి మరీ చంపడం వంటి అఘాయిత్యాలకు రజాకార్లు పాల్పడతారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు ఎలాంటి పోరాటం చేశారు. ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజ్ సప్రు) పాత్ర ఏంటి? చివరికి భారతదేశంలో హైదరాబాద్ ఎలా భాగమైంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రాంత ప్రజలు మరికొన్ని రోజులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. దాని గురించి ఇప్పటికే పలు సినిమాల్లో చెప్పారు. అయితే ఈ ‘రజాకార్’ మూవీలో ఆ టైంలో పోరాటం చేసిన గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి రెండున్నర గంటల్లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చెప్పాలంటే అది చిన్న విషయం కాదు. దర్శకుడు యాటా సత్యనారాయణని ఆ విషయంలో అభినందించాల్సిందే. ఒక చరిత్రని 2 గంటల పాటు కళ్ళకి కట్టినట్టు చూపించడం అంటే మాటలు కాదు. దీనికి ఎంతో అనాలసిస్ చేసి ఉండాలి. దర్శకుడు జర్నలిస్ట్ కాబట్టి, పుస్తకాల పురుగు కాబట్టి.. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలిగాడు.

- Advertisement -

ఇలాంటి కథని రాజమౌళి లాంటి గొప్ప దర్శకులు తీస్తే ఇంకా బాగుంటుందేమో. కానీ రాజమౌళి కూడా యాటా సత్యనారాయణ అంత సహజంగా అయితే తీసేవాడు కాదేమో. అంతలా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ‘రజాకార్’ ని తీర్చిదిద్దాడు యాటా సత్యనారాయణ. ఫస్ట్ హాఫ్ పరంగా కొంత బోర్ కొట్టించింది ఈ సినిమా. ముఖ్యంగా వయొలెన్స్ చాలా టూ మచ్ గా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం… చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కట్టిపడేస్తాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకి ఇంకా ప్లస్ అయ్యింది అని చెప్పాలి. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాత పెట్టిన రూ.50 కోట్ల బడ్జెట్ స్క్రీన్ పై కనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. మకరంద్ దేశ్‌పాండే పాత్ర సినిమా చూసాక అందరినీ వెంటాడుతుంది అని చెప్పాలి. ఖాసీం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ చాలా క్రూయల్ గా కనిపించాడు. పటేల్ పాత్ర పోషించిన రాజ్ సప్రు కూడా బాగా నటించాడు. ఇంద్రజ, ప్రేమ, అనసూయ, వేదిక, బాబీ సింహా, అనుష్య త్రిపాఠి, జాన్ విజయ్… వంటి నటీనటులు కూడా తమ స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చి వారెవ్వా అనిపిస్తారు. ఇంకా చాలా మంది చిన్న నటీనటులు కూడా ఈ సినిమాలో నటించారు. అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :
డైరెక్షన్
సెకండ్ హాఫ్
ప్రొడక్షన్ వాల్యూస్
పెర్ఫార్మన్స్ లు

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
వయొలెన్స్

మొత్తంగా.. హైదరాబాద్ గురించి చాలా మందికి తెలీని చరిత్రని ‘రజాకార్’ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ వారం కచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది.

రేటింగ్: 2.75 / 5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు