Satyam Rajesh Tenant Movie Review : టెనెంట్ మూవీ రివ్యూ

Satyam Rajesh Tenant Movie Review : పెద్ద సినిమాలు ఏవీ లేక బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. నాని వంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న సందర్భాలు ఏమీ లేవు. మరోపక్క ఆంధ్రాలో ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండటంతో జనాలు థియేటర్లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఈ టైంని క్యాష్ చేసుకోవాలని చిన్న సినిమాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఓటీటీ కోసం తీసిన ‘టెనెంట్’ వంటి చిన్న సినిమాని కూడా థియేట్రికల్ రిలీజ్ ఇస్తున్నారు.’సత్యం’ రాజేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో సత్యం రాజేష్ ఇంకో హిట్టు కొట్టాడా? లేదా? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

కథ :

బాగా సెటిల్ అయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్… గౌతమ్ (సత్యం రాజేష్) తన భార్య సంథ్య (మేఘా చౌదరి) శవాన్ని సూట్ కేసులో పెట్టుకుని ఓ చోట పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. ఈ సీన్ తో సినిమా మొదలవుతుంది. మరధలినే ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమ్ ఎందుకు తన ఆమెను చంపేశాడు? వివాహేతర సంబంధమే దీనికి కారణమా? అసలు వారి పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఋషి(భరత్ కాంత్) కావ్య (రమ్య పొందూరి).. లతో సంధ్య, గౌతమ్.. లకి సంబంధం ఏంటి? ఈ కేసుని పోలీసులు (ఎస్తేర్ అండ్ టీం) ఎలా సాల్వ్ చేశారు? చివరికి గౌతమ్ ఏమయ్యాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

భార్యని చంపేసి ఆ కేసు నుండి తప్పించుకోవాలనుకునే భర్త కథలని మనం గతంలో కూడా చూశాం. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఫలించలేదు. ‘టెనెంట్’ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడు మళ్ళీ ఇలాంటి రొటీన్ కథని ఈ టీం ఎలా ఎంపిక చేసుకుంది? అనే ప్రశ్నలు అందరి మైండ్లోకి వస్తాయి. కానీ కనీసం అలాంటి కథనే కొత్తగా అయినా చెప్పుంటే బాగుణ్ణు. ఏదేదో తీసేసి చివరికి ఇదో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనుకోమన్నాడు దర్శకుడు వై.యుగంధర్. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ చాలా వీక్ గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని మనం ముందుగానే గెస్ చేసేయొచ్చు. అంత వీక్ గా ఉంది స్క్రీన్ ప్లే.

- Advertisement -

సీరియస్ గా సాగే సినిమా కాబట్టి కామెడీకి ఎక్కడా స్కోప్ లేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే అవి కూడా జీరో. నిర్మాణ విలువలు కూడా గొప్పగా ఏమీ లేవు. రెండు, మూడు లొకేషన్స్ లోనే సినిమాని మొత్తం చుట్టేశారు. ఈ కథకి అంతకు మించి బడ్జెట్ కూడా అవసరం లేదు లెండి. వై.యుగంధర్ సినిమాటోగ్రఫీ మాత్రం రిచ్ గా ఉంది. ప్రతి సన్నివేశం క్వాలిటీగా కనిపించడానికి కూడా అదే కారణం అని చెప్పొచ్చు. మ్యూజిక్ కూడా ఓకే. ఉన్నది ఒక్కపాటే అయినా వినడానికి, చూడటానికి అది బాగానే ఉంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదు.

నటీనటుల విషయానికి వస్తే.. సత్యం రాజేష్, పేరుకి ఈ సినిమాలో హీరో అంతే. మొదటి 2 ,3 సీన్లు తీసేస్తే అసలు అతనికి నటించే స్కోప్ దక్కలేదు. ఈ పాత్రకి ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా బాలేదు. మేఘా చౌదరి లుక్స్ బాగున్నాయి. నటన కూడా ఓకే. భరత్ కాంత్ కి హీరోని మించి ఎలివేషన్స్ ఇచ్చారు. చందన పయ్యావుల నటన ఓకే. ఎస్తర్‌ నోరోన్హా రీసెంట్ టైమ్స్ లో కాస్త మెరుగైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని చెప్పాలి. యూట్యూబ్ యాంకర్ చందుకి కూడా మంచి పాత్ర దొరికింది. తన వరకు బాగానే చేశాడు. అతను సిక్స్త్ సెన్స్ తో పలికే డైలాగులు కూడా నవ్విస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం గంటన్నర మాత్రమే ఉండటం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

మొత్తంగా ఈ ‘టెనెంట్’ బోర్ కొట్టించే ఓ మర్డర్ మిస్టరీ డ్రామా. ఎక్కడా హై అంటూ లేని ఈ సినిమాని థియేటర్స్ లో చూడటం చాలా కష్టం. సింపుల్ గా స్కిప్ కొట్టి ఓటీటీకి వచ్చాక ఫాస్ట్ ఫార్వార్డ్ బట్టన్ సాయంతో చూడటం ఉత్తమం.

రేటింగ్ : 1.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు