Market Mahalakshmi Movie Review : మార్కెట్ మహాలక్ష్మీ మూవీ రివ్యూ

Market Mahalakshmi Movie Review : ‘కేరింత’ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్ లో కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించిన పార్వతీశం ఆ తర్వాత ఏవేవో సినిమాల్లో నటించాడు కానీ… ఏవీ కూడా అతనికి ‘కేరింత’ రేంజ్లో గుర్తింపు తెచ్చిపెట్టలేదు. పైగా అనుకోకుండా అతను సినిమాల నుండి గ్యాప్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు అతను హీరోగా ‘మార్కెట్ మహాలక్ష్మీ’ అనే సినిమా వచ్చింది. పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ :

హీరో (పార్వతీశం.. ఇతనికి క్యారెక్టర్ పేరు లేదు) ప్రభుత్వ ఆఫీస్ లో గుమస్తాగా(కేదార్ శంకర్) కొడుకు. ఆ గుమస్తా ఎలాగైనా తన కొడుక్కి కోట్ల రూపాయల కట్నం వచ్చే సంబంధం రప్పించాలని లక్షలు ఖర్చు పెట్టి.. ఇంజనీరింగ్ చదివిస్తాడు. అనుకున్నట్టుగానే అతను ఇంజినీరు అవుతాడు. కానీ హీరో సున్నితమైన వ్యక్తి. పుస్తకాలూ అవి ఎక్కువగా చదువుతూ చాలా జెన్యూన్ గా ఉంటాడు. అలాంటి హీరోకి అతను తండ్రి చూసిన సంబంధాలు నచ్చవు.ఈ క్రమంలో అనుకోకుండా కూరగాయల మార్కెట్ కి వెళ్లి అక్కడ మార్కెట్ మహాలక్ష్మీ(ప్రణీక అన్విక) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమె చాలా కఠినంగా ఉంటుంది. ఆమె తండ్రి పక్షపాతం వల్ల మంచాన పడటం, అన్న తాగుడికి బానిస అవ్వడంతో… కుటుంబ భారాన్ని తన నెత్తిపై వేసుకుని అలా కఠినంగా మారిపోతుంది. అలాంటి అమ్మాయిని ప్రేమించి హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆమె కంటే కఠినమైన తండ్రిని కన్విన్స్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది? మిగిలిన కథ.

విశ్లేషణ :

ప్రేమకథల్లో ఉండే కాన్ఫ్లిక్ట్ పేద, గొప్ప. అయితే పెద్దింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం.. ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం. అది కాదు అంటే.. పెద్దింటి అబ్బాయి.. పేదింటి అమ్మాయిని ప్రేమించడం.. అతని తండ్రి ఒప్పుకోకుండా అడ్డం తిరగడం. ఇవే థీమ్ తో చాలా కథలు వచ్చాయి. వి ఎస్ ముఖేష్ దీనికి మోడరన్ టచ్ ఇచ్చి ఇంకోలా చెప్పాలి అనుకున్నట్టు ఉన్నాడు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్… ఓ మార్కెట్ పిల్లని ప్రేమించడం, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం.. ఇది సహజత్వానికి చాలా దూరంగా ఉన్న లైన్ అని ఎప్పుడు అనిపిస్తుంది? డైరెక్షన్ సరిగ్గా లేనప్పుడే ఇది గుర్తొస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయలేకపోతే.. దాని ఫలితం తారుమారు అయిపోతుంది.

- Advertisement -

‘మార్కెట్ మహాలక్ష్మీ’ విషయంలో జరిగింది అదే. బోలెడంత ఫన్ జెనరేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ, ఎందుకో దర్శకుడు ఆ ఛాన్స్ ను ఉపయోగించుకోలేదు. సార్ట్ ఫిలింకి సెట్ అయ్యే కాన్సెప్ట్ ను 2 గంటల పాటు సాగదీశాడే తప్ప… తన డైరెక్షన్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ రెండూ వీక్ గానే ఉన్నాయ్. జో ఎన్మవ్ సంగీతంలో రూపొందిన పాటల్లో ‘శాంతమే’ అంటూ సాగే పాట పర్వాలేదు అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. పార్వతీశం నటన సో సోగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని మార్క్ కామెడీని ఇందులో కంప్లీట్ గా వాడలేదు. పైగా ఇబ్బంది పడుతూనే అతను నటించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ప్రణీక అన్విక పర్వాలేదు. కానీ కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే నడిపించారు. ముక్కు అవినాష్, ‘సలార్’ ఫేమ్ పూజా వంటి వారి కామెడీ ఓకే. మహబాబ్ బాషా కూడా ఓకే అనిపించేలా నటించాడు. కేదార్ శంకర్ అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. మిగతా వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం

మైనస్ పాయింట్స్ :

మిగతావన్నీ

చివరిగా.. ‘మార్కెట్ మహాలక్ష్మీ’ ఏ దశలోనూ ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇలాంటి సినిమా ఓటీటీల్లో కూడా కంప్లీట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ వీకెండ్ కి వచ్చిన సినిమాల్లో ఇది కూడా పాస్ మార్కులు వేయించుకోలేదు అనే చెప్పాలి.

రేటింగ్… 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు