Rebel Moon 2 OTT Movie Review in Telugu : ఓటిటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ రెబల్ మూన్ 2 రివ్యూ

Rebel Moon 2 OTT Movie Review : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రెబెల్ మూన్ 2 నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యింది. జాక్ స్నైడర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఫస్ట్ పార్ట్ ను 2023లో నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. అయితే యాక్షన్ సీన్స్, విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నప్పటికీ టేకింగ్ మాత్రం బాలేదంటూ విమర్శలు వినిపించాయి. తాజాగా రెబల్ మూన్ పార్ట్ 2 ది స్కార్గివర్‌ మూవీని ఏప్రిల్ 19న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. మరి సీక్వెల్ అయినా జాక్ స్నైడర్ స్టైల్ లో ఉందా? లేదంటే మొదటి పార్ట్ లాగే నిరాశపరిచిందా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ

ముందుగా పార్ట్ 1 స్టోరీని తెలుసుకుందాం. మదర్ వరల్డ్ అనే ప్రాంతానికి దూరంగా వెల్ద్ అనే ప్రాంతంలో రైతులు ప్రశాంతంగా బ్రతుకుతారు. కానీ మదర్ వర్డ్ అడ్మిరల్ నోబుల్ ఒక్కో ప్రాంతంపై దాడి చేస్తూ అక్కడి సంపదను దోచుకుంటాడు. ఈ క్రమంలోనే వెల్ద్ లోని ధాన్యాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు నోబుల్. ఈ నేపథ్యంలో కోరా అక్కడ తిరుగుబాటుదారులను కలుసుకొని నోబుల్ ని ఎదురించి చంపేస్తుంది. కానీ శరీరం చీలిపోయిన అడ్మిరల్ ను మదర్ వరల్డ్ కు సంబంధించిన వర్గం వారు రక్షిస్తారు. మరోవైపు కోరా ఆమె గ్రూప్ వాళ్ళు నోబుల్ చనిపోయాడని అనుకోవడంతో పార్ట్ వన్ కంప్లీట్ అవుతుంది.

రెబల్ మూన్ పార్ట్ 2 విషయానికి వస్తే…

నోబుల్ తిరిగి బ్రతకడంతో మొదలవుతుంది స్టోరీ. ప్రాణాలతో బయటపడిన నోబుల్ మళ్లీ వెల్డ్ ప్రజల సంపదను దోచుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు? అతను బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న కోరా వెల్డ్ ప్రజలను ఎలా రక్షిస్తుంది? నోబుల్ ను అంతమొందించడానికి టైటాన్స్, నేమిసిస్, తారక్, గున్నర్ లాంటి టీమ్స్ కు చెందిన తిరుగుబాటు దారులు ఏం చేశారు? వీరంతా కలిసి నోబుల్ ను ఎలా ఎదుర్కొన్నారు? కొరాకు ఉన్న మరో పేరు వెనుక సీక్రెట్ ఏంటి ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ

డైరెక్టర్ జాక్ స్నైడర్ ఫ్యాన్స్ ఫస్ట్ పార్ట్ చూసి నిరాశపడ్డారు. ఇక సెకండ్ పార్ట్ ట్రైలర్ రిలీజ్ కాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమాను చూశాక పార్ట్ టూ కంటే పాట్ వన్ బాగుందని ఫీల్ అవుతారు. ఫస్ట్ పార్ట్ లో విజువల్స్, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. కానీ రెండో పార్ట్ లో అవన్నీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత అసలైన యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతుంది. కాకపోతే అందులో కొత్తదనం ఏమీ కనిపించదు. సీన్స్ అన్నీ క్లైమాక్స్ తో సహా ఊహకు అందే విధంగా ఉండడంతో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. కాకపోతే ఎమోషనల్ సీన్స్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక టేకింగ్ సినిమా పరంగా మూవీ బాగుంది. కానీ ఊహించే ఫ్లాట్ తో ట్విస్ట్ లు లేకుండా రెగ్యులర్ ఫార్మాట్ లో మూవీ సాగడమే ఇందులో అతిపెద్ద మైనస్.

మొత్తానికి చెప్పాలంటే సినిమాలో నటీనటులు అదరగొట్టారు. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండా చూడాలి అనుకునే వారు ఓసారి ఈ మూవీని చూడొచ్చు. ఫ్యామిలీతో సినిమాను చూడాలనుకునేవారు ఈ సినిమాలో రెండు మూడు చోట్ల మసాలా సీన్స్ ఉన్నాయని గుర్తు పెట్టుకుంటే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు