Sreeja : కొత్త ప్రయాణం మొదలు.. కామెంట్స్ కి అర్థం..?

Sreeja.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటే దాదాపుగా అదొక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.. వీరే కాకుండా వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక ఇలా తదితరులు సైతం బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి కూతుర్లలో పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా మారింది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటుంది.

Sreeja: Start a new journey.. What do the comments mean..?
Sreeja: Start a new journey.. What do the comments mean..?

వ్యాపారి రంగంలోకి అడుగుపెట్టిన శ్రీజ..

శ్రీజ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉండేది. ప్రస్తుతం చిరంజీవి కుటుంబంతోనే వున్న ఈమె.. తాజాగా కొత్త బిజినెస్ వైపుగా అడుగులు వేయాలని ప్రయత్నాలు చేస్తోంది శ్రీజ.. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ నుంచి కొత్త ప్రయాణం మొదలయ్యింది అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ శ్రీజ చేసేటువంటి ఈ కొత్త ప్రయాణం దేనికి సంబంధించింది అని మెగా అభిమానులు తెగ వెతికేస్తున్నారు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీజ కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఈమె హైదరాబాదులో ఒక ఫిట్నెస్ సెంటర్ ని సైతం మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తోందట.

జిమ్, యోగ కూడా..

అలాగే జిమ్ , యోగ ఇతర కార్యక్రమాలు కూడా ఇందులో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు ఈ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ కూడా అయిందని తెలుస్తోంది. అందుకు గెస్ట్లుగా రెజీనా, సందీప్ కిషన్, శిల్పా శెట్టి తదితరులు సైతం ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా సమాచారం. శ్రీజ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్లలో జిమ్, యోగ వంటి సెంటర్లలో భాగమైనందుకు తనకు చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ తెలియజేస్తోంది.

- Advertisement -

భర్త నుంచీ దూరంగా..

శ్రీజ , తన భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయినట్టుగా గత కొన్నేళ్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం శ్రీజ వద్దే తన పిల్లలు పెరుగుతున్నారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్లుగా ప్రచారం, జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయాన్ని ఇరువురు ప్రకటించలేదు. కళ్యాణ్ దేవ్ , శ్రీజ ఇద్దరు కూడా విడివిడిగానే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు తన కూతురితో కలిసి కళ్యాణ్ దేవ్ ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ దేవ్ హీరోగా కూడా రెండు మూడు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం తానే సొంతంగా బిజినెస్ పనులు చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా రెండు వివాహాలు చేసుకున్నా.. వైవాహిక జీవితంలో సంతోషంగా లేనటువంటి శ్రీజ బిజినెస్ ద్వారా సక్సెస్ అయ్యి కెరియర్ లో ముందడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికైతే ఈ రంగంలో ఈమె సక్సెస్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు