OTT Releases of this week : ఈ వారం ఓటిటిలోకి టిల్లుతో పాటే 16 సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఈ 5 మాత్రం డోంట్ మిస్

OTT Releases of this week : చాలా మంది థియేటర్లలో కన్నా ఇంట్లోనే కూర్చుని ఓటిటిలో ప్రతి వారం వచ్చే కొత్త కొత్త సినిమాలను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ కోసమే ఏప్రిల్ చివరి వారమైన ఈ వారం ఓటిటిలోకి ఏకంగా 17 సినిమాలు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కడ, ఎప్పుడు విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం. ఇక ఈ 17లో రెండు భీమా, టిల్లు స్క్వేర్ మాత్రం మిస్ కాకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు.

ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లే ఉండడం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 6 వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆపిల్ ప్లస్ టీవీలలో ఒక్కో వెబ్ సిరీస్, జియో సినిమాలో రెండు వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా 11 వెబ్ సిరీస్ లే కావడం విశేషం. వీటిలో మూడు వెబ్ సిరీస్ లు, నాలుగు సినిమాలు మాత్రమే మోస్ట్ అవైటెడ్ అని చెప్పొచ్చు. హార్రర్ ఇన్వెస్టిగేటివ్ ఫాంటసీ థ్రిల్లర్ డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్, దిల్ దోస్తీ డైలామా, సర్వైవల్ థ్రిల్లర్ గుడ్ బై ఎర్త్ అనే వెబ్ సిరీస్ లు, టిల్లు స్క్వేర్, భీమా, కుంగ్ ఫూ పాండా 4, క్రాక్ సినిమాలు ఈ వారం ఓటిటిలోకి అడుగు పెట్టబోతున్నాయి.

1. భీమా

భీమా మూవీ స్టోరీ ఒక చిన్న పట్టణంలోని దేవాలయంలో జరుగుతున్న రహస్య సంఘటనలను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా కన్పించారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, నిహారిక కొణిదెల, రోహిణి సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

- Advertisement -

2. టిల్లు స్క్వేర్

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చ్ 29న థియేటర్లలోకి వచ్చింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

3. క్రాక్

విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్ హీరోలుగా, అమీ జాక్సన్, నోరా ఫతేహి హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ డ్రామా క్రాక్. ఏప్రిల్ 26న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4. డెడ్ బాయ్ డిటెక్టివ్స్

‘డెడ్ బాయ్ డిటెక్టివ్స్’ స్టోరీ ఇద్దరు టీనేజ్ దెయ్యాల చుట్టూ తిరుగుతుంది. వారు తమ దెయ్యాల క్లెయింట్స్ కోసం రహస్యాలను ఛేదించడానికి ఒక దివ్యదృష్టితో పని చేస్తారు. ఈ సిరీస్ లో జార్జ్ రెక్స్‌స్ట్రూ, జేడెన్ రెవ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

5. కుంగ్ ఫూ పాండా 4

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కుంగ్ ఫూ పాండా 4’ కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేసింది. ఈ వారం ఈ హాలీవుడ్ యానిమేషన్ మూవీనే చిన్న పిల్లలకు స్పెషల్ కాబోతోంది. ఏప్రిల్ 26న కుంగ్ ఫూ పాండా 4 బుక్‌మైషోలో సినిమా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు