Samantha Comments : ఫహాద్ ఆవేశం చూసి భయపడ్డాను… సామ్ షాకింగ్ కామెంట్స్

Samantha Comments : మయోసైటీస్‌తో సమంత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ, సినిమాలకు మాత్రం దూరంగా ఉండటం లేదు. ఓ వైపు మయోసైటీస్ కు చికిత్స తీసుకుంటూనే మరో వైపు ఈ గ్యాప్ ను ఏంజాయ్ చేస్తుంది. అలాగే ఖాళీ సమయాల్లో నచ్చిన సినిమాలను, సిరీస్‌లను చూస్తుంది. వాటి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. తాజాగా సమంత ఓ సినిమాను చూడటమే కాదు, దాని రివ్యూను కూడా ఇచ్చేసింది. అది ఏ సినిమా అంటే… ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం మూవీ మలయాళంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఫహాద్ 22 ఏళ్ల కెరీర్‌లో ఆవేశం మూవీనే ఫస్ట్ 100 cr కలెక్ట్ చేసిన మూవీ. అయితే ఈ మూవీని తాజాగా సామ్ చూసి, సినిమాలో అన్ని రకాల మ్యాడ్ నెస్ ఉందని, ఈ మ్యాడ్ తనకు చాలా నచ్చింది అంటూ రివ్యూ ఇచ్చింది. ఈ సినిమాను చూసి సామ్ భయపడిందట.. కానీ, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే థియేటర్‌లో చూడాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి.. అందులో ఆవేశం కూడా ఒకటి అంటూ సామ్ తన రివ్యూలో చెప్పుకొచ్చింది. ఈ ఆవేశం సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఏంజాయ్ చేయాలని సామ్ కోరింది.

- Advertisement -

కాగా, ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీ మొత్తాని ఆకర్షిస్తుంది. ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు ఒక మలయాళంలోనే కాదు, తెలుగు లోనూ మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా అదే దారిలో వెళ్తుంది. ఇప్పటికే ఈ మూవీ మలయాళంలో 100 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు