Singer Srilalitha Engagement : వైభవంగా వరాహరూపం సాంగ్ సింగర్ శ్రీలలిత ఎంగేజ్మెంట్

Singer Srilalitha Engagement : పాపులర్ తెలుగు సింగర్ శ్రీలలిత భమిడిపాటి త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోంది. తాజాగా వైభవంగా ఆమె ఎంగేజ్మెంట్ వేడుక జరగగా, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గాయని శ్రీలలిత భమిడిపాటి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా సినిమాలో ఉన్న పాపులర్ సాంగ్ వరాహ రూపం పాడి ఆమె కూడా సూపర్ పాపులర్ అయిపోయింది. అలాగే ఈ పాటకు శ్రీ లలిత భమిడిపాటి చేసిన కవర్ సాంగ్ ఆమెకు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ పాట ఏకంగా ఏడు లక్షల వ్యూస్ సాధించి రికార్డును క్రియేట్ చేసింది. ఇక పాటలతో పాటు పలు రియాలిటీ షోలలో పాడి మెప్పించిన శ్రీలలిత తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. గుడిపాటి సీతారాంతో శ్రీ లలిత ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను శ్రీలలిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, అందులో కాబోయే భార్య భర్తలు ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటూ కనిపించారు. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులతో పాటు గాయని శ్రీలత అభిమానులు కూడా కాబోయే భార్య భర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ…

సింగర్ శ్రీలలిత ఆరేళ్ల వయసు నుంచి పలు రియాలిటీ షోలలో పాటలు పాడి ఆకట్టుకుంది. సంగీతం నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన శ్రీ లలిత మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజి మీద రైమ్స్ బదులు లింగాష్టకం పాడి అందరినీ అబ్బురపరిచింది. అయితే శ్రీ లలిత ముత్తాతలు, అమ్మమ్మ వాళ్ళ కుటుంబం మొత్తం సంగీత విధ్వంసులే. అలాగే ఆమె, అమ్మ నాన్న కూడా గాయకులే కావడంతో సహజంగానే శ్రీలలితకు సింగింగ్ పై చిన్నప్పుడే మక్కువ ఏర్పడింది.. ఇక అదే ప్యాషన్ ను కంటిన్యూ చేస్తూ లిటిల్ చాంప్స్, బోల్ బేబీ బోల్, పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి 15 కు పైగా రియాలిటీ షోలలో పాడి మెప్పించారు శ్రీలలిత. మ్యూజిక్ లో ఏంఏ పూర్తి చేసిన ఆమె తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అద్భుతంగా పాటలు పాడారు. అయితే ఎన్ని పాటలు పాడినా చివరకు ఓ ఇన్స్టిట్యూట్ పెట్టి కర్ణాటక సంగీతాన్ని సంగీత ప్రియులకు నేర్పించాలన్నదే ఆమె లక్ష్యం.

- Advertisement -

శ్రీ లలిత పాడిన పాటలు…

అద్భుతంగా పాటలు పాడే శ్రీ లలిత సినిమాలకు పెద్దగా పాడలేకపోయింది. ఒకానొక సందర్భంలో తనకు మొహమాటం ఎక్కువ అని, అడగడం చేతకాదని, అందుకే ఇప్పటిదాకా సినిమా పాటలు పడే ఛాన్స్ రాలేదని వెల్లడించింది. అయితే అప్పటిదాకా తను పాడిన పాటలు సినిమా పాటలు అని తెలియకుండానే పాడాను అని, సంగీత దర్శకులను ఎవర్ని పెద్దగా అప్రోచ్ కాకపోవడంతోనే సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ రాలేదని వెల్లడించింది. కరోనా టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన శ్రీ లలిత అందులో కవర్ సాంగ్స్ పాడుతూ ఆకట్టుకుంటుంది. ఇక శ్రీ లలిత కాంతారా మూవీ కోసం పాడిన వరాహ రూపం సాంగ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు