Hanuman: కలెక్షన్స్ ఫుల్ రెమ్యూనరేషన్ హఫ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చేసిన సినిమా హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుక రిలీజ్ అయింది. అయితే మొదటి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ సినిమాకు హైదరాబాద్లో కేవలం మొదట ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రమే దొరికాయి. అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి మంచి రెస్పాన్స్ ను సాధించుకొని హిట్టు టాక్ ను సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాకు థియేటర్లు పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా నిన్నటితో వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది.

సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల్లో కంటే సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ అయితే వాటి కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక సినిమా యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా 100 కోట్లు మార్కులు చేరుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పుడు సంక్రాంతికి ఒక సినిమాను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతికి కూడా థియేటర్ వద్ద చాలా పెద్ద సినిమాలు పోటీకి దిగాయి.

వెంకటేష్ నటించిన సైన్ధవ్, నాగార్జున నటించిన నా సామి రంగ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో దిగాయి. అయితే అన్నిటికంటే ఎక్కువగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పైన మంచి అంచనాలు ఉండేవి. దీని కారణం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటం. అయితే ఈ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. మొదట నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఆ తర్వాత మహేష్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన సేఫ్ జోన్ లోకి వచ్చింది ఈ సినిమా.

- Advertisement -

వీటన్నింటి మధ్యలో చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించిన సినిమా హనుమాన్. చాలామంది పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి మంచి కలెక్షన్స్ ను కట్టబెట్టారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా కూడా రాబోతుంది. దీనిలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నట్లు ప్రశాంత్ వర్మ కూడా రివీల్ చేశారు. అయితే హనుమాన్ సినిమాకు సంబంధించి తేజకు ఇంకా 50 లక్షలు వరకు రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఇవ్వాలని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం నిరంజన్ రెడ్డి దగ్గర ఆ డబ్బులు లేవని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఇంకా రావాల్సిన సేల్స్ ఇంకా రాలేదని విషయాలు తెలుస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో తేజ సజ్జకు రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఇకపోతే ఏదేమైనా ఈ సినిమాతో మంచి గుర్తింపును కూడా సాధించుకున్నాడు తేజ. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా మరికొన్ని సినిమాలు రానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు