Sravana Bhargavi : కూతురితో పయనమైన శ్రావణ భార్గవి.. కొత్త అనుమానాలకు దారి

Sravana Bhargavi.. టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ హేమచంద్ర ఆయన భార్య శ్రావణ భార్గవి ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది ఇంతకాలం ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య ఇప్పుడు విడాకులు రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా వీరిద్దరూ తమ వైవాహిక జీవితం నుంచి విడిపోయారనే వార్తలు గత రెండు మూడేళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి .. కానీ ఎప్పుడూ కూడా ఈ విషయం పైన ఎవరు స్పందించలేదు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపించడం కూడా మానేశారు.. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎక్కడ కూడా కనిపించకపోవడంతో అభిమానులకు వీరిద్దరూ విడిపోయారనే విషయం పై మరింత బలం చేకూరుతోంది..

Sravana Bhargavi: Sravana Bhargavi traveled with her daughter.. leading to new suspicions..!
Sravana Bhargavi: Sravana Bhargavi traveled with her daughter.. leading to new suspicions..!

హేమచంద్రను వదిలి ఒంటరిగా పయనం..

ముఖ్యంగా శ్రావణ భార్గవి, హేమచంద్ర విడిపోయారని.. వీరిద్దరి మౌనాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజెన్స్ కూడా తెలియజేస్తున్నారు. ఇక శ్రావణ భార్గవి పోస్టులో కూడా హేమచంద్ర ఎక్కడ కనిపించలేదు. అయితే వీరి పాప మాత్రం శ్రావణి వద్ద ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల శ్రావణ భార్గవి కూడా తన కూతుర్ని తీసుకొని సమ్మర్ వెకేషన్ కి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈమె షేర్ చేసినటువంటి పోస్ట్ పై హేమచంద్ర గురించి కూడా పలు రకాల వార్తలు కామెంట్ల రూపంలో వైరల్ అవుతున్నాయి..

హేమచంద్ర ఎక్కడ అంటూ కామెంట్స్..

ముఖ్యంగా హేమచంద్ర ఎక్కడ అక్క.. హేమచంద్ర అన్నను మిస్ అవుతున్నాము.. మీరందరూ కలిసి ఉండాలంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. అయితే హేమచంద్ర మాత్రం ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పలు రకాల పనులతో చాలా బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.. శ్రావణ భార్గవి కూడా పాడ్ కాస్ట్ లతో ఫుల్ ట్రెండీగా మారుతోంది. ముఖ్యంగా శ్రావణ భార్గవి సెలబ్రిటీలతో చేసేటువంటి పలు రకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

హేమచంద్ర – శ్రావణ భార్గవి పై రూమర్స్ నిజమేనా..

హేమచంద్ర , శ్రావణ భార్గవి.. 2013 ఫిబ్రవరి నెలలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యాన్యంగా ఉండే ఈ జంట గత కొద్దిరోజుల నుంచి మనస్పర్ధలు కారణం చేత విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే విడాకుల కోసం కోర్టులో అప్లై చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. రైడ్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువెళ్లారు.. కానీ ఆ పెళ్లిని ఎక్కువ కాలం నిలుపుకోలేక పోతోంది ఈ జంట. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు పొందిన ఈ జంట విడాకుల విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.మరి అసలు విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు