Bigg Boss Swetha Varma : ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్… శ్వేత వర్మ స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss Swetha Varma : ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది అన్నది నిజం. అయితే దానివల్ల ఇబ్బందులు కూడా అదే రేంజ్ లో పెరిగాయి. తరచుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే పోస్టులకు పలువురు అసభ్యకర కామెంట్స్ చేసి చిర్రెత్తిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ శ్వేత వర్మకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. అయితే చాలా మందిలాగా ఆమె సైలెంట్ గా ఉండకుండా తన స్టైల్ లో ఇచ్చి పడేసింది. మరి ఇంతకీ శ్వేత వర్మ తన ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ చేసిన నెటిజన్ కు ఇచ్చిన రిప్లై ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శ్వేతా వర్మ ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటిదాకా సిల్వర్ స్క్రీన్ పై మెరిసినా రాని గుర్తింపు బిగ్ బాస్ తో ఒక్కసారిగా రావడంతో ఈ బ్యూటీ పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానమే దక్కించుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రొటీన్ లో పడిపోయింది ఈ బ్యూటీ. వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా చిన్న చిన్న పాత్రలు అయినా చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో శ్వేతా వర్మకు ఒక చేదు అనుభవం ఎదురైంది.

ఒక వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడనే విషయాన్ని బయట పెట్టింది శ్వేతా వర్మ. అయితే కేవలం అక్కడితో వదిలేయకుండా దానికి సంబధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి, సదరు వ్యక్తికి గట్టిగానే ఇచ్చి పడేసింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో శ్వేతా వర్మ తనపై అతను చేసిన కామెంట్స్ గురించిన స్క్రీన్ షాట్లను, ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. అతను తనపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి కామెంట్స్ ఎలా చేయాలనిపిస్తుంది? అతని అమ్మని కూడా ఎవరైనా ఇలాగే అంటే పర్వాలేదా? అంటూ సూటిగా ప్రశ్నించింది.

- Advertisement -

ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఇలాంటి వాళ్ళని చూస్తే సిగ్గేస్తుందని, తనకున్న కాంటాక్ట్స్ ద్వారా అతని అడ్రస్ సంపాదించానని చెప్పుకొచ్చింది. అయితే అది రియల్ లేదా ఫేక్ అకౌంట్ అయినా తనకు అనవసరమని, తాను కావాలనుకుంటే అతని కాంటాక్ట్ డీటెయిల్స్ తో పాటు అడ్రస్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీయగలనని వార్నింగ్ ఇచ్చింది. కానీ తను అలా చేయాలనుకోవట్లేదని, మనిషిని కాబట్టి ఇలాంటి దరిద్రమైన పని చేసిన అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోవట్లేదని వెల్లడించింది శ్వేతా వర్మ. దీన్ని చూసైనా అతను గుణపాఠం నేర్చుకోవాలని, ఇలాంటి చండాలమైన పనులు మళ్లీ మళ్లీ చేయకుండా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్ పీకింది శ్వేత. మరి సదరు వ్యక్తికి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు