Zombie Movies in OTT : థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే జాంబీ మూవీస్ ఇవే.. డోంట్ మిస్

Zombie Movies in OTT : హారర్ మూవీస్ ని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే అందులోనూ సపరేట్ జానర్స్ ఉంటాయి. దయ్యాలు, జాంబిలు ఇలా డీఫరెంట్ జానర్లు ఉండగా, అందులో జాంబీ సినిమాలను చూసి థ్రిల్ అవ్వాలి అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇక హాలీవుడ్ నుంచి వచ్చే జాంబి హారర్ సినిమాలను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తారు. మరి జాంబీ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏ ఓటీటిల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం పదండి.

1. జాంబిరెడ్డి

ఈ జానర్ లో ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు మూవీ జాంబిరెడ్డి గురించే. హనుమాన్ మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ జాంబిరెడ్డి. ఇక ఈ జానర్లో తెలుగులో వచ్చిన మొట్టమొదటి మూవీ కూడా ఇదే కావడం మరో విశేషం. 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జాంబిరెడ్డి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. 28 డేస్ లేటర్

2002లో వచ్చిన హాలీవుడ్ మూవీ 28 డేస్ లేటర్. కోమాలోకి వెళ్లి హాస్పిటల్లో పడున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత లేచి చూస్తే అప్పటికే ప్రపంచమంతా జాంబీలుగా మారడం కనిపిస్తుంది. ఓ సీక్రెట్ ల్యాబ్ నుంచి రిలీజ్ అయిన వైరస్ మనుషులను జాంబిగా మారే స్టొరీనే ఈ 28 డేస్ లేటర్. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. వరల్డ్ వార్ జెడ్

హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ మూవీ మనుషులను జాంబీలుగా మార్చే వైరస్ స్టోరీతో సాగుతుంది. హీరో ఆ వైరస్ ను నాశనం చేసి, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? అనే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

4. ట్రైన్ టు బుసాన్

ఈ కొరియన్ జాంబి మూవీని జాంబి మూవీ లవర్స్ పొరపాటున కూడా మిస్ కావొద్దు. సియోల్ నుంచి బుసాన్ వెళ్తున్న రైల్లో జాంబి అటాక్ జరగడం వంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో పాటు, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఈ మూవీలోఅద్భుతంగా ఉంటాయి. ఈ మూవీ నెట్ ఫ్లిప్స్ లో అందుబాటులో ఉంది.

5. మిరుతన్

ఈ తమిళ సినిమా ఓ కుక్క సెక్యూరిటీ గాడ్ ను కరవడం నుంచి మొదలై అతను జాంబిగా మారడం, ఆ ప్రమాదకరమైన జాంబి రోగం నుంచి జనాలను కాపాడడానికి పోలీస్ అధికారి చేసే ఇంట్రెస్టింగ్ ప్రయత్నంతో సాగుతుంది. మిరుతన్ మూవీనీ జీ5 లో చూడొచ్చు.

6. జాంబి ల్యాండ్

ఊహించని వ్యాధి మనుషులందరినీ జాంబిలుగా మార్చేస్తే నలుగురు మాత్రమే తప్పించుకుంటారు. మరి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ జాంబి ల్యాండ్ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ నెక్స్ట్ ఫ్లిక్స  లో స్ట్రీమింగ్ అవుతోంది.

6. గో గోవా గాన్

2013లో వచ్చిన ఈ బాలీవుడ్ మూవీ అనుకోకుండా గోవాలో జాంబిల బారిన పడిన  ముగ్గురు స్నేహితులు గురించి ఉంటుంది. మరి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనే ఇంట్రెస్టింగ్ కథను ప్రైమ్ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు