Aparna Das: పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.. ఫోటోలు వైరల్..!

Aparna Das.. ప్రముఖ హీరోయిన్ అపర్ణ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈమె.. మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్ తేజ్, ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ సినిమాలో కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. అంతే కాదు ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ కాస్త తెలుగు హీరోయిన్ గా మారిపోయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది.. తన ప్రియుడు నటుడు దీపక్ పరమా తో కలసి గుడిలో ఏడడుగులు వేసింది.. పెళ్ళికి ముందు హల్దీ వేడుక , సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా చేసుకున్న ఈ జంట పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా సంప్రదాయ పద్ధతిలో వడంకంచేరి లోని ఒక గుడిలో ఎటువంటి హడావిడి లేకుండా వివాహం చేసుకున్నారు .ఇక ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీ లు కూడా వైరల్ గా మారుతున్నాయి.మలయాళీ ఇండస్ట్రీకి చెందిన అపర్ణ దాస్ గత కొన్ని సంవత్సరాలుగా దీపక్ తో ప్రేమలో ఉంది.. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసుకున్న తర్వాత తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు.. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకతో ఒక్కటయ్యింది ఈ జంట..

Aparna Das:Married Telugu heroine.. Photos viral..!
Aparna Das:Married Telugu heroine.. Photos viral..!

అపర్ణ దాస్ , దీపక్ సినిమాలు..

నాన్ ప్రకాష్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అబ్బురపరిచింది.. ఇక నటుడు దీపక్ పరమా మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమాతో సినీ రంగప్రవేశం చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక ఇటీవల చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మంజుమ్మెల్ బాయ్స్ అనే సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం హీరోగా వరశంపరి అనే చిత్రంలో నటిస్తున్నారు..

అపర్ణ దీపక్ సినిమాలు..

ఇకపోతే గతంలో అపర్ణ దాస్, దీపక్ పరమా కలసి మనోహరం అనే సినిమాలో నటించారు.. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు.. ఈరోజు అనగా ఏప్రిల్ 24 బుధవారం తెల్లవారుజామున గురువాయూర్ ఆలయంలో అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

- Advertisement -

చాలా సింపుల్ గా వివాహ వేడుక..

సామాన్యులు కూడా ఇంత సింపుల్గా వివాహం చేసుకోరేమో అనేంతలా వీరు తమ వివాహాన్ని జరుపుకున్నారు.. కేరళ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇక గుడికి వచ్చిన భక్తులు వీరి పెళ్లి వీడియోని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇక ఈ జంట చూడముచ్చటగా అందరిని ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Siju Wilson (@siju_wilson)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు